గురుకుల విద్యాసంస్థలో 9210 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల అఫిషియల్ కీ లను టీఆర్ఈఐఆర్బీ (TREIRB) విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి 23 వరకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా పూర్తి అయ్యాయని బోర్డ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 75.68 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన కీతో కూడిన మాస్టర్ ప్రశ్న పత్రాలను అఫిషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు తన లాగిన్ ద్వారా సమాధాన పత్రం డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఆన్సర్ కీ లకు సంబందించి అభ్యంతరాలుంటే 23వ తేదీ వరకు తెలియజేయాలని కోరారు. వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 9210 పోస్టుల భర్తీకి 9 నోటిఫికేషన్‌లు జారీ చేశారు. వీటికి సంబంధించిన ‘కీ’లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 26వ తేదీలోగా లాగిన్ ఐడి ద్వారా తెలియజేయాలి. ఈ మెయిల్, పిటిషన్లు స్వీకరించబడవని కన్వీనర్ స్పష్టం చేశారు.