HomeLATESTనేడే ఎస్ఐ తుది రాత పరీక్ష.. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ.. తప్పక తెలుసుకోవాల్సిన...

నేడే ఎస్ఐ తుది రాత పరీక్ష.. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ.. తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే..

తెలంగాణలో ఎస్ఐ ఖాళీల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ చేపట్టిన చేపట్టిన నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన ఫైనల్ రాత పరీక్షను నేడు, రేపు (ఈ నెల 8, 9 తేదీల్లో) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ఈ ఎగ్జామ్ ను నిర్వహించనుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఈ రాత పరీక్షలను హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ రోజు హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన ఉంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు నగరంలో అమలలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఎస్ఐ అభ్యర్థులు ట్రాఫిక్ ఆంక్ష‌లను దృష్టిలో ఉంచుకుని.. 2 గంట‌ల ముందే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని సూచించారు.

Advertisement

అభ్యర్థులు తప్పక గుర్తించుకోవాల్సిన నిబంధనలు..
-అభ్యర్థి యొక్క గుర్తింపును ఆయా పరీక్షా కేంద్రాల్లోని సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తారు.
-పరీక్ష ప్రారంభం అయిన తర్వాత అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతించడం జరుగదు. పరీక్ష పూర్తయ్యేంతవరకు కూడా అభ్యర్థులు పరీక్షా హాలును వదిలి వెళ్ళరాదు.
-అభ్యర్ధి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు.
-అభ్యర్థి తన హాల్ టికెట్ ను పరీక్షాకేంద్రం ప్రవేశం నందు మరియు పరీక్షహాల్లో చూపించాలి. లేనట్లయితే పరీక్షాహాల్లోకి అనుమతించబడదు.
-అభ్యర్థి ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్/ సెల్యూలర్ ఫొన్లుగాని, ట్యాబ్స్, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ లు, వాచ్ లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుళ్ళు, పర్స్, చార్ట్స్, విడి కాగితములు లేదా రికార్డు చేసే పరికరాలు పరీక్షా హాల్లోకి తీసుకువెళ్లకూడదు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు.
-పరీక్షాహాల్లోకి తీసుకెళ్లాల్సినవి.. 1)బ్లాక్ లేదా బ్లూపాయింట్ పెన్ను 2) తుది పరీక్ష హాల్ టికెట్ 3) ఏదైనా ఒక ఒరిజనల్ ధృవపత్రం (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగునవి)

-అభ్యర్ధులు పరీక్షా హాల్లోకి నిర్ణీత సమయానికి ఒకగంట ముందుగా చేరుకోవాలి.
-పరీక్షరాసే ముందు అభ్యర్థి OMR షీట్ పై ఉన్న సూచనలను పూర్తిగా చదువుకోవాలి.
-అభ్యర్థి OMR షీట్ పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్ధనలు లేదా గుర్తింపు చిహ్నాలు మొదలగునవి ఏవైనా రాసినచో అట్టి జవాబు పత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగదు. OMR షీట్ పై చిత్తుపని చేయరాదు.

-అభ్యర్థికి బదులు మరొక అభ్యర్థి పరీక్ష రాసినట్లయితే వారి పరీక్షను రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
-అభ్యర్థులు మెహంది, సిరా మొదలగునవి వాటిని చేతులపై గానీ, పాదాలపై గానీ రాసుకుని రాకూడదు.

Advertisement

-ప్రశ్నపత్రం ఇంగ్లీష్/ తెలుగు లేదా ఇంగ్లిష్/ఉర్దూ భాషలలో ఇవ్వబడును.
-OMR జవాబుపత్రంలో వృత్తములను బ్లూ లేదా బ్లాక్ పెన్ లతో మాత్రమే పూరించవలెను. వేరే ఏ ఇతర రంగు పెన్నులు, పెన్సిళ్ళు, ఇంక్/జెల్ పెన్నులు అనుమతించబడవు.

జవాబు పత్రంపై..
1) జవాబుపత్రంలో నిర్ధేశించబడిన స్థలంలోనే హాల్ టికెట్ నెంబర్ రాయాలి.
2)జవాబుపత్రంలోని ఇతర ప్రదేశాల్లో ఎక్కడా పేరు రాయకూడదు.
3)అభ్యర్థికి సంబంధించిన వివరములు ఏవీ కూడా జవాబుపత్రంలో రాయకూడదు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!