రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 2130 లెక్చరర్ల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపట్టాలని టీఎస్పీఎస్సీకి అనుమతులు జారీ చేసింది. దీంతో ఆయా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. కాలేజీయేట్ ఎడ్యుకేషన్, కాలేజీయేట్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని లెక్చరర్ పోస్టులతో పాటు లైబ్రెరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ అమోదం తెలిపిన వాటిలో మొత్తం 95 లైబ్రేరియన్ పోస్టులు, 157 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులతో పాటు స్టేట్ ఆర్కివ్స్ డిపార్టమెంట్లో రీసెర్చ్ అసిస్టెంట్ తదితర పోస్టులకు అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం 2440 పోస్టుల రిక్రూట్మెంట్కు లైన్ క్లియరైంది. ఈ పోస్టులన్నీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది.
తాజాగా ఆర్థిక శాఖ అనుమతించిన పోస్టులు
జూనియర్ లెక్చరర్లు 1392
లైబ్రెరియన్ 40,
పీడీ 91
డిగ్రీ, పీజీ కాలేజీ లెక్చరర్లు 491
లైబ్రెరియన్ 24,
పీడీ 29
ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్లు 247
లైబ్రెరియన్ 31,
పీడీ 37,
మ్యాట్రన్లు 5
Lokesh
Good
Super good
Drivers post is not their
Please do send me the news in english
I had completed my post graduation.and preparing for UPSC and SI exams.