Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణలో మరో 9 జాబ్ నోటిఫికేషన్లు.. కొనసాగుతోన్న కొలువుల జాతర

తెలంగాణలో మరో 9 జాబ్ నోటిఫికేషన్లు.. కొనసాగుతోన్న కొలువుల జాతర

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో 9 జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. హైకోర్టులో ఆఫీస్‌ సబార్డినేట్‌ సహా పలు పోస్టుల భర్తీకి బుధవారం 9 నోటిఫికేషన్లను విడుదల చేశారు అధికారులు. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 176 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు 72 కేటాయించారు.

Advertisement

ఖాళీల వివరాలు:
1. హైకోర్టు సబార్డినేట్‌-50
2. సిస్టమ్‌ అసిస్టెంట్‌-45
3. ఎగ్జామినర్లు-17
4. అసిస్టెంట్లు-10
5. యూడీ స్టెనోలు-2
6. అసిస్టెంట్‌ లైబ్రేరియన్లు-2
7. కంప్యూటర్‌ ఆపరేటర్లు-20
8. ట్రాన్స్‌లేటర్లు- 10
9. కోర్టు మాస్టర్లు/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు- 20

దరఖాస్తు ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 11ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష మార్చిలో నిర్వహించనున్నారు. హాల్‌ టికెట్లు ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉంటాయి.
అధికారిక వెబ్ సైట్: https://tshc.gov.in/

విద్యార్హతల వివరాలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లలో చూడొచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!