ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 6100 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలకు సంబంధించి నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇటీవల ముగిసింది. తాజాగా ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది రిక్రూట్మెంట్ బోర్డ్. అభ్యర్థులు slprb.ap.gov.in లింక్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు ఇప్పటికే బోర్డు ప్రకటించింది.
ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం 200 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్.. ఇందులో అర్హత సాధించిన వారికి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్ లోడ్ స్టెప్స్:
Step 1: అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2:హోం పేజీలో కనిపించే Download Hall Ticket for SCT PC (Civil and APSP) లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను సూచించిన విధంగా నమోదు చేసి డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ తీసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి.