Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణలో మరో 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణలో మరో 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణలో మరో 2 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పదిహేను యూనివర్సిటీల బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ‘ది తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ బిల్లు ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. గవర్నర్ ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అయితే.. ఈ బిల్లుపై అభ్యంతరాలు గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు గవర్నర్ తమిళిసైని కలిసి సందేహాలను నివృత్తి చేశారు.

Advertisement

దీంతో ఈ ఉద్యోగాలకు సంబంధించి మరో వారంలో గవర్నర్ నుంచి ఆమోద ముద్ర వస్తుందని అంతా భావించారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన నెల రోజుల్లోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మొత్తం 2020 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో యూనివర్సిటీలన్నీ వేర్వేరుగా ఉద్యోగాల భర్తీని చేపట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యేయి. అవినీతి కూడా జరిగేదన్న ఆరోపణలు వినిపించేవి. ఈ నేపథ్యంలోనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.

యూనివర్సిటీ వారీగా ఖాళీల వివరాలు..

  1. ఉస్మానియా యూనివర్సిటీ 872
  2. జేఎన్టీయూ 347
  3. కాకతీయ 299
  4. తెలంగాణ 74
  5. మహాత్మాగాంధీ 35
  6. శాతవాహన 45
  7. తెలుగు 66
  8. బీఆర్ఏఓయూ 48
  9. పాలమూరు 73
  10. ఆర్జీయూకేటీ 127
  11. జేఎన్ఏఎఫ్ఏయూ 34
    మొత్తం ఖాళీలు 2,020

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!