Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSమరో 6 జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. ఈ సారి న్యాయశాఖలో.. మొత్తం ఖాళీలు, విద్యార్హతల వివరాలివే..

మరో 6 జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. ఈ సారి న్యాయశాఖలో.. మొత్తం ఖాళీలు, విద్యార్హతల వివరాలివే..

తెలంగాణలో నిత్యం నోటిఫికేషన్ల జాతర సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి ఏకంగా 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. ఇంకా.. మార్చి తర్వాత విడుదల కానున్న మిగతా నోటిఫికేషన్ల వివరాలకు సంబంధించిన నియామకాల క్యాలెండర్ ను సైతం హైకోర్టు విడుదల చేసింది.

Advertisement

ఇందులో నాన్ టెక్నికల్ పోస్టులకు మొత్తం 6 నోటిఫికేషన్లను విడుదల చేసింది హైకోర్టు. వీటికి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11, 2023 నుంచి ప్రారంభం కానుంది. టెక్నికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లను మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

నాన్ టెక్నికల్ పోస్టులు..

1.జూనియర్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు. మొత్తం 271 పోస్టులను జిల్లాల వారీగా విడుదల చేసింది. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

2.ఫీల్డ్ అసిస్టెంట్
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ జిల్లాల్లో 76 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

Advertisement

3.ఎగ్జామినర్
మొత్తం 63 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

4.రికార్డ్ అసిస్టెంట్
ఈ విభాగంలో మొత్తం 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.

5.ప్రాసెస్ సర్వర్
ఈ విభాగంలో మొత్తం 163 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

6.ఆఫీస్ సబార్డినేట్
ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10 వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. ఇంతకు మించి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.

దరఖాస్తు ఫీజు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్ కు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600 చెప్పున.. ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

Advertisement

దరఖాస్తులు ప్రారంభ తేదీ- జనవరి 11, 2023

దరఖాస్తులకు చివరి తేదీ- జనవరి 31, 2023

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ తేదీ- ఫిబ్రవరి 15, 2023

Advertisement

పరీక్ష తేదీ – మార్చి 2023

నాన్ టెక్నికల్ పోస్టులు:


మార్చి 2023లో టెక్నికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయి. వీటిలో టైపిస్ట్ , కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల- మార్చి 01, 2023

Advertisement

దరఖాస్తులు ప్రారంభం – మార్చి 10, 2023

దరఖాస్తులకు ఆఖరి తేదీ – మార్చి 31, 2023

హాల్ టికెట్స్ డౌన్ లోడ్ – ఏప్రిల్ 15, 2023

Advertisement

పరీక్ష – ఏప్రిల్ / మే , 2023

అన్ని నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!