స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది. లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. DEO(Date Entry Operator)పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా.. విద్యార్థి 12వ తరగతిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
Read This: టెన్త్ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే..
వయోపరిమితి: అభ్యర్థుల యొక్క వయస్సు జనవరి 01, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వేతనం: ఎల్డీసీ పోస్టులకు వేతనం రూ.19,900-రూ. 63,200 మధ్య ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.25,500-రూ. 81,100 మధ్య ఉంటుంది.
SSC CHSL ఎగ్జామ్కు అప్లికేషన్ ఫీజు రూ. 100గా నిర్ణయించారు. మహిళలు, SC, ST, దివ్యాంగులు లేదా మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
అధికారిక వెబ్ సైట్ లింక్- Link
ఇంపార్టెంట్ డేట్స్..
అప్లికేషన్లు ప్రారంభం – డిసెంబర్ 06, 2022
అప్లికేషన్లకు లాస్ట్ డేట్ – జనవరి 04, 2023
టైర్ 1 ఎగ్జామ్ డేట్ – ఫిబ్రవరి, మార్చి 2023
టైర్ 2 ఎగ్జామ్ డేట్ – త్వరలో షెడ్యూల్ చేస్తారు.