మరో నెలన్నరలో కొత్త ఏడాది రానుంది. ఈ నేపథ్యంలో 2023లో ప్రభుత్వ సెలవులకు సంబంధించిన వివరాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తం 28 సెలవులు ఉంటాయని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు మరో 24 ఆప్షనల్ హాలీడేస్ జాబితాను సైతం విడుదల చేశారు. ఇందులో న్యూఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి కూడా ఆదివారం రోజే వచ్చే ఏడాది రానుంది.
సాధారణ సెలవులు ఇవే
జనవరి 1 – నూతన సంవత్సరం
జనవరి 14 – భోగి
జనవరి 15 – సంక్రాంతి
జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 7 – హోళీ
మార్చి 22 – ఉగాది
మార్చి 30 – శ్రీరామనవమి
ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 – అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 22 – రంజాన్
ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
జూన్ 29 – బక్రీద్
జులై 17 – బోనాలు
జులై 29 – మొహర్రం
ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబరు 7 – కృష్ణాష్టమి
సెప్టెంబరు 18 – వినాయక చవితి
సెప్టెంబరు 28 మిలాద్-ఉన్-నబి
అక్టోబర్ 2 – గాంధీ జయంతి
అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
అక్టోబరు 24 – విజయదశమి
అక్టోబరు 25 – విజయదశమి తర్వాతి రోజు
నవంబర్ 12- దీపావళి
నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
డిసెంబరు 25 – క్రిస్మస్
డిసెంబర్ 26 – బాక్సింగ్ డే
ఇంకా.. దీపావళి సైతం ఆదివారం రోజే వచ్చింది. కనుమ, మహవీర్ జయంతి, బసవ జయంతి, వరలక్ష్మి వ్రతం, దుర్గాష్టమి, నరకచతుర్ధి తదితర మొత్తం 24 రోజుల్లో ఆప్షనల్ హాలీడేస్ ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఏప్రిల్ నెలలో అత్యధికంగా 5 సెలవులు వచ్చాయి. ఆ నెలలోనే బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్, రంజాన్ (2 రోజులు), అంబేద్కర్ జయంతి ఇలా మొత్తం 5 సెలవులు వచ్చాయి. అయితే.. మే నెలలో ఒక్క సెలవు కూడా రాలేదు.
WT happened