రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎక్సైజ్, రవాణా శాఖలో ఈ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు,
ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్(ఎల్‌సీ) 57 పోస్టులు,
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
ఫుల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ ఇక్కడ అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా పోస్టు చివర్లో ఉంది.