HomeLATESTతెలంగాణ కోర్టుల్లో 591 ఖాళీలు

తెలంగాణ కోర్టుల్లో 591 ఖాళీలు


తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టులు జ్యుడీషియల్‌ మినిస్టేరియల్‌ సర్వీసెస్‌ పరిధిలో స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలయింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్​ 4వ తేదీ లోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 591

స్టెనోగ్రాఫర్‌: ఇందులో మొత్తం 64 పోస్టులున్నాయి. గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌లో నాలెడ్జ్​ ఉన్న వాళ్లు అర్హులు. వయసు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్​ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్​ కూడా ఉంటుంది.

జూనియర్‌ అసిస్టెంట్‌: ఇందులో మొత్తం 173 ఖాళీలున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ సంబంధించిన నాలెడ్జ్​ ఉండాలి. వయసు18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వూకు 20 మార్కులు ఉంటాయి.

టైపిస్ట్‌: ఈ విభాగంలో మొత్తం 104 పోస్టులున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. వయసు18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. రాతపరీక్షకు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్: ఇందులో 39 పోస్టులున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. ఇందులో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షకు 80 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

ఎగ్జామినర్‌: ఇంటర్​ ఉత్తీర్ణతతో మొత్తం 42 పోస్టులున్నాయి. వయసు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

కాపీస్ట్‌: ఇంటర్​ ఉత్తీర్ణతతో 72 ఖాళీలు ఉన్నాయి. వయసు 18 నుంచి 34 ఏండ్లు ఉండాలి. రాతపరీక్షకు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఓరల్‌ ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

రికార్డు అసిస్టెంట్‌: ఇందులో మొత్తం 34 పోస్టులున్నాయి. ఇంటర్​లో ఉత్తీర్ణులై 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారు అర్హులు. రాతపరీక్ష 80 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు ఉంటాయి.

ప్రాసెస్‌ సర్వర్‌: ఇందులో మొత్తం 63 ఖాళీలున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతో 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు 80 మార్కులు,ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు కేటాయిస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్​ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్​సైట్​: www.tshc.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!