HomeLATESTటీఎస్​ రెసిడెన్షియల్​ కాలేజీల్లో అడ్మిషన్లకు ఎంట్రన్స్​​–2022

టీఎస్​ రెసిడెన్షియల్​ కాలేజీల్లో అడ్మిషన్లకు ఎంట్రన్స్​​–2022

రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2022–23 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లీష్​ మీడియం అడ్మిషన్లకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​ –2022 నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. మే లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు. టీఎస్​ఆర్జేసీ ఎంట్రెన్స్​లో మెరిట్​, రిజర్వేషన్​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

టీఎస్​ఆర్జేసీ కామన్​ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం మల్టీపుల్​ చాయిస్​ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంచుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లీష్​, మ్యాథ్స్​, ఫిజిక్స్​ నుంచి, బైపీసీ విద్యార్థులకు ఇంగ్లీష్​, బయోలజికల్​ సైన్స్​, ఫిజిక్స్​, ఎంఈసీ గ్రూప్​లో చేరేవారికి ఇంగ్లీష్​, సోషల్​ స్టడీస్​, మ్యాథ్స్​ సబ్జెక్టుల నుంచి పదో తరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. రెండున్నర గంటలు పరీక్షా సమయం కేటాయిస్తారు.

అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు మార్చి 07 తేది నుంచి ఏప్రిల్​ 11వ తేది వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.200 ఉంటుంది. ప్రవేశ పరీక్ష మే 22వ తేదిన నిర్వహిస్తారు.
వెబ్​సైట్​ www.tsrdjc.cgg.gov.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!