స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీసు విభాగంలోని 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు. గరిష్ఠ వయో పరిమితి 25 ఏళ్లకు మించకూడదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తో పాటు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ తో వచ్చే మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
పోస్టులు: కానిస్టేబుల్ (పురుషులు): మొత్తం 5,056 పోస్టుల్లో జనరల్ – (3053), ఈడబ్ల్యూఎస్ (542), ఓబీసీ (287), ఎస్సీ ( 872), ఎస్టీ (302). మహిళలకు మొత్తం 2491 కేటాయించగా జనరల్ (1502), ఈడబ్ల్యూఎస్ (268), ఓబీసీ(142), ఎస్సీ(429), ఎస్టీ (150) పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కచ్చితంగా వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.శారీరక ప్రమాణాలు పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 81 సెం.మీ ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
సెలెక్షన్: అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు. 2023 డిసెంబర్లో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలు – 100 మార్కులకు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ తదితర అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ డ్యురేషన్ 90 నిమిషాలు.
దరఖాస్తులు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు (పే లెవల్- 3) రూ.21,700 – రూ.69,100 వరకు జీతం అందిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.