Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ అర్హతతో 45 వేల కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్..

టెన్త్ అర్హతతో 45 వేల కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్..

యువతలో పోలీస్ ఉద్యోగాలకు ఉండే క్రేజే వేరు. లక్షల మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు కారణం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దాదాపు 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఏపీలోనూ 6 వేలకు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదట 24,389 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆ సంఖ్యను 45,284కు పెంచింది. CAPF, SSF, ITBP, CRPF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు అధికారులు. అక్టోబర్ 27న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 చివరితేదిగా నిర్ణయించారు. అంటే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్/టెన్త్ విద్యార్హత పొంది ఉండాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికులు (ESM) అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి..

  1. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్)
  2. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
  3. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్‌ టెస్ట్‌

అధికారిక వెబ్ సైట్: https://ssc.nic.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!