స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)2,049 సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేస్తోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీతో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్లేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తదితరాలు.
పోస్టులు: లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్వైజర్, సీనియర్ ట్రాన్స్లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనిష్టంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్మెటిక్ స్కిల్) (25 ప్రశ్నలు, 50 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) (25 ప్రశ్నలు, 50 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షకు గంట సమయం కేటాయించారు.
దరఖాస్తులు: అభ్యర్థులు మార్చి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్కు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. పరీక్ష మే 6 నుంచి 8వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ssc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.