ఎస్ఐ ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ హాల్‌టికెట్లు రేపటి నుంచి (30 వ తేదీ) అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 5వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లు అఫిషియల్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈలోపే అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. షెడ్యూలు ప్రకారమే ఆగస్టు 7వ తేదీన ఆదివారం ఎస్ఐ ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ జరుగుతుంది.
హైదరాబాద్‌తో పాటు 35 కేంద్రాల్లో 513 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 2,47,217 మంది అభ్యర్థులు ఈసారి పరీక్షలకు హాజరవనున్నారు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి
SI PRLIMINARY TEST 2022 HALL TICKETS DOWNLOAD LINK (5 వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ లోపే డౌన్లోడ్ చేసుకోవాలి)
Kachrajupally