HomeLATESTఎస్‌బీఐలో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్​ పోస్టులు

ఎస్‌బీఐలో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్​ పోస్టులు


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం సర్కిల్​ బేస్డ్​ ఆఫీసర్​ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


మొత్తం ఖాళీలు: 1226 (రెగ్యులర్‌-1100, బ్యాక్‌లాగ్‌-126)


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.


వయసు: 1 డిసెంబర్ 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 1 డిసెంబర్ 2000 – 2 డిసెంబర్​1991 మధ్య జన్మించి ఉండాలి.

Advertisement


సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌), స్ర్కీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఎగ్జామ్​ ప్యాటర్న్​: రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ 120 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌కి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.


1) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు 30 మార్కులు 30 నిమిషాలు
2) బ్యాంకింగ్‌ నాలెడ్జ 40 ప్రశ్నలు 40 మార్కులు 40 నిమిషాలు
3) జనరల్‌ అవేర్‌నెస్‌/ ఎకానమ 30 ప్రశ్నలు 30 మార్కులు 30 నిమిషాలు
4) కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులు 20 నిమిషాలు

Advertisement


డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్​ ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.


చివరి తేది: 29 డిసెంబర్​ 2021
ఆన్‌లైన్ ఎగ్జామ్​: జనవరి 2022.
వెబ్​సైట్: www.sbi.co.in

Advertisement

ఐఓసీఎల్‌ సదరన్‌ రీజియన్‌లో అప్రెంటిస్​లు


ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌), మార్కెటింగ్‌ డివిజన్‌ సదరన్‌ రీజియన్‌ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 300


ట్రేడులు:
1) రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌ – ఫ్రెషర్‌/ స్కిల్‌ సర్టిఫికెట్‌ హోల్డర్స్‌)
2) ఐటీఐ/ అకౌంటెంట్‌/ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ – ఫ్రెషర్‌/ స్కిల్‌ సర్టిఫికెట్‌ హోల్డర్స్‌
3) టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌లు

Advertisement


దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్​ ప్రాసెస్ ప్రారంభం: 10 డిసెంబర్​ 2021.
చివరి తేది: 27 డిసెంబర్​ 2021.
వెబ్​సైట్​: www.iocl.com

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!