Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSసెయిల్​లో 245 మేనేజ్​మెంట్​ ట్రెయినీ జాబ్స్.. నెలకు రూ.1.80 లక్షల వరకు జీతం

సెయిల్​లో 245 మేనేజ్​మెంట్​ ట్రెయినీ జాబ్స్.. నెలకు రూ.1.80 లక్షల వరకు జీతం

ఇంజనీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్​ న్యూస్​. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. మహారత్నల్లో ఒకటైన స్టీల్ అథారిటీ ఆఫ్​ ఇండియా (SAIL) తాజాగా ట్రెయినీ పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్​ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టీల్​ ప్లాంట్లలో పని చేసేందుకు మేనేజ్​మెంట్​ ట్రెయినీ ల నియామకం చేపట్టనుంది. టెక్నికల్​ విభాగంలో 245 మేనేజ్​మెంట్​ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు అర్హులు.

మెకానికల్​, మెటలర్జికల్​, ఎలక్ట్రికల్​, కెమికల్​, ఇన్​స్ట్రుమెంటేషన్​, మైనింగ్​, సివిల్ ఇంజనీరింగ్​ పూర్తయిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. గేట్​ 2022 లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడుతారు. గేట్​ మార్కుల ఆధారంగా అభ్యర్థులను స్టార్ట్ లిస్ట్ చేసి తదుపరి గ్రూప్​ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నవంబర్​ 3వ తేదీ నుంచి అప్లికేషన్ల నమోదు మొదలవుతుంది. నవంబర్​23వ తేదీ వరకు తుది గడువు ఉంది. SAIL అఫిషియల్​ వెబ్​సైట్​ లోని కెరిరీ కేటగిరీలో పొందుపరిచిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించిన డైరెక్ట్ లింక్​.. https://sailcareers.com/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!