HomeLATESTహరగోపాల్ తో పాటు మరో ఐదుగురికి ఊరట.. తెలంగాణకు కేంద్రం నుంచి రూ.5.27 లక్షల కోట్లు:...

హరగోపాల్ తో పాటు మరో ఐదుగురికి ఊరట.. తెలంగాణకు కేంద్రం నుంచి రూ.5.27 లక్షల కోట్లు: కిషన్ రెడ్డి.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ.. ఎయిర్పోర్ట్ లో పిల్లికి జాబ్.. నేటి వార్తలు జూన్ 17

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి

ఫైటర్ జెట్ పైలట్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం సంతోషదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ రోజు దుండిగల్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ రివ్యూయింగ్ ఆఫీసర్ గా రాష్ట్రపతి హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడారు. కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో మొత్తం 119 ఫ్లైయింగ్ ఎయిర్ ట్రైనీ, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరితో పాటు ఎనిమిది మంది ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అందులో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు, ఆరుగురు నేవీ, కోస్ట్ గార్డ్కు చెందిన క్యాడెట్లు ఉన్నారు.

Advertisement

హరగోపాల్ తో పాటు మరో ఐదుగురికి ఊరట

పౌరహక్కుల నేత ప్రొ.హరగోపాలర్‌‌తో పాటు మరో 152 మందిపై పెట్టిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) కింద నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్‌‌ డీజీపీ అంజనీకుమార్‌‌కు శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ములుగు జిల్లా ఎస్‌పీకి డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరగోపాల్‌తో పాటు మరో ఐదుగురిపైనా పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హరగోపాల్, పద్మజా షా, అడ్వకేట్ రఘునాథ్‌, గడ్డం లక్ష్మణ్ , గుంటి రవీంద్ర, సురేష్ కుమార్‌లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

తెలంగాణకు కేంద్రం నుంచి రూ.5.27 లక్షల కోట్లు: కిషన్ రెడ్డి

తొమ్మిదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ. 5.27 లక్షల కోట్ల నిధులు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి రిపోర్ట్ పీపుల్ పేరుతో ఇవాళ బాగ్ లింగంపల్లిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంతో పోలీస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా శాతం పెరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతగానో సహకరించారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఎన్నో నిధులు, ప్రాజెక్టులిచ్చామని చెప్పారు.

ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ

తెలంగాణ యూనివర్సిటీ వీసీ దాచేపల్లి రవీందర్ గుప్తా ఏసీబీ వలలో చిక్కుకున్నారు. హైదరాబాద్ తార్నాక లోని ఆయన ఇంట్లో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ లో ప్రైవేట్ కాలేజీకి ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు కోసం ఆయన రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వాహకులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. యూనివర్సిటీలో వీసీ అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నట్లు ఈసీ సభ్యులు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయగా ఈనెల 6, 13 తేదీల్లో ఏసీబీ, విజిలెన్స్ ఆఫీసర్లు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌కు చిక్కడంతో ఆయన హయాంలో వర్శిటీలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నాయి.

Advertisement

కర్నాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు కేసీఆర్ కుట్ర: రేవంత్ రెడ్డి


కర్నాటకలో కాంగ్రెస్ ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని, వందల కోట్లు ఖర్చు చేసి కర్నాటకలో కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు గాంధీభవన్ లో మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆరెస్ కు పెద్ద తేడా ఏం లేదన్నారు. అక్కడ బీజేపీది 40శాతం కమిషన్ సర్కార్ అయితే ఇక్కడ బీఆరెస్ ది 30 శాతం కమీషన్ సర్కార్ అని ఆరోపించారు.

బీఆర్ఎస్ నేతల నివాసాల్లో ముగిసిన ఐటీ సోదాలు

మూడు రోజులుగా బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు ముగిశాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు చేయడంతో అధికార పార్టీలో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్ గా సోదాలు జరిగాయి. సోదాల్లో బీఆర్ఎస్ నేతల నివాసాలు, ఆఫీసుల నుంచి అధికారులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు నిన్న రాత్రి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ ఉదయం కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని ఇంట్లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. మరోపక్క జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇండ్లలోనూ ఐటీ సోదాలు ముగిశాయి.

తెలంగాణ కళా వైభవాన్ని చాటేలా ర్యాలీ: మంత్రి శ్రీనివాస్ గౌడ్


అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్మరణ ర్యాలీ ని నగరంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. డా. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం నుంచి అమర జ్యోతి వేదిక వరకు అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించాలన్నారు. అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహణ ముందస్తు ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నా ఈ ర్యాలీలో తెలంగాణ కళా వైభవాన్ని దశ దిశలా చాటాలన్నారు. 5 వేల మంది పైచిలుకు జానపద, గిరిజన, దక్కనీ కళాకారులు, శాస్త్రీయ కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ జరిగింది. ఈరోజు ఉదయం ఒకటో నంబర్ ప్లాట్​ఫామ్ వద్ద వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్న వృద్ధురాలి హ్యాండ్ బ్యాగ్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాగులో సుమారు రూ.60 లక్షల విలువైన డైమండ్​ నెక్లెస్​తో పాటు ఇతర ఆభరణాలు ఉన్నట్లు ఆ వృద్ధురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం


అమెరికా ఎయిర్​పోర్టులో ఓ పిల్లి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని చూసి ఎవరో ప్రయాణికుడి పెంపుడు పిల్లి అయ్యుంటుందని అనుకున్నవారంతా దీని పోస్టు తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కోలో డ్యూక్​ ఎల్లింగ్టన్​ మోరిస్​ అనే పిల్లి డ్యూటీలో చేరింది. విమానం ఎక్కడం మొదటి సారి కావడం వల్లనో ఇతర కారణాలతోనో కొందరు ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి వారిని సముదాయించి వారకి కాస్త ఎంటర్​టైన్​మెంట్ అందించడమే ఈ పిల్లి గారి పని. దీనితో కాసేపు గడిపితే టెన్షన్​ పోగొడుతుందట. ఇందుకోసం ఈ పిల్లికి ఎయిర్​పోర్టు అధికారులు ట్రైనింగ్​ కూడా ఇచ్చారు.

కాజీపేటలో దారుణం.. పిల్లలపై వీధికుక్కల దాడి

హన్మకొండ జిల్లాలోని కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్పలో ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై వీధికుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 18 నెలల పాపతో పాటు, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పిల్లలపై దాడిచేసిన కుక్కను స్థానికులు చంపారు. వీధి కుక్కలు విజృంభిస్తున్నా పట్టించుకోవడం లేదని GWMC అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!