హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 2022-– 2023 విద్యాసంవత్సరానికి కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ (సీప్) ద్వారా పార్ట్ టైం ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సులు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూన్ 30వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఆగస్టు 7న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.osmania.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.