Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1326 పోస్టులు

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1326 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) సివిల్​ అసిస్టెంట్​ సర్జన్​, ట్యూటర్​ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 1326 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టరేట్‌లో)–751, ట్యూటర్లు (మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌లో)–357, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-జనరల్‌/ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (టీవీవీపీ)–211, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో)–7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయిన అభ్యర్థులు అర్హులు. వయసు 18 నుంచి -44 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఈ ప్రక్రియ 100 పాయింట్లకు ఉంటుంది. ఇందులో అర్హత పరీక్షలో (ఎంబీబీఎస్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. మిగిలిన 20 పాయింట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో/ సంస్థల్లో/ ప్రోగ్రాముల్లో కాంట్రాక్ట్​/ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేసిన అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.mhsrb.telangana.gov.in వెబ్​సైట్​లో చూడాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!