నీట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET 2023 ) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీ అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఇచ్చింది.
జనరల్ అభ్యర్థులు రూ.1700, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జండర్, దివ్యాంగులు రూ.వెయ్యి ఎగ్జామ్ ఫీజు కోసం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ ఏడాది మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకూ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ నుంచి 200 మల్టీపుల్ చాయిస్ క్వశన్స్ ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది. విద్యార్థులు ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాస్తారో దరఖాస్తు సమయంలోనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
బీఎస్సీ నర్సింగ్, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కోర్సుల్లో ప్రవేశాలను సైతం నీట్ మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారు. అందుకే నర్సింగ్ కోర్సుల్లో చేరదల్చుకున్న స్టూడెంట్స్ కూడా నీట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
NEET UG 2023 Exam Date
Conducting Agency | National Testing agency |
Exam | NEET UG 2023 |
Notification | 6th March 2023 – Starting |
Online Registration Start Date | 6th March 2023 |
Last Date | 6th April 2023 |
NEET UG Exam Date 2023 | 7th May 2023 |
Eligibility | 12th class or Inter pass with Biology Physics, Chemistry |
Courses Offered | MBBS, BDS, Ayush Courses, Nursing Courses |
Age Limit | 18 Years or Above |
Registration Mode | Online |
Exam Level | All India |
Official Website Direct link for Registrations | neet.nta.nic.in |

