2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన 6వ తరగతిలో అడ్మిషన్లకు నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) నిర్వహించే పరీక్షకు అడ్మిట్కార్డులను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://navodaya.gov.in/nvs/en/Home1/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులు పొందడానికి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 29న ఉదయం 11.30గంటలకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
హాల్ టికెట్లను ఇక్కడ క్లిక్ చేసి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.