HomeTSLPRBఇలా ప్రిపేరయితే లాజికల్​ రీజనింగ్​ ఈజీ (SI, CONSTABLE, GROUP 1 PRELIMS)

ఇలా ప్రిపేరయితే లాజికల్​ రీజనింగ్​ ఈజీ (SI, CONSTABLE, GROUP 1 PRELIMS)

గ్రూప్​–1 నోటిఫికేషన్​ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్​–1 తొలి నోటిఫికేషన్ కావడంతో పాటు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం నిరుద్యోగులకు గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. మే 02 నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే చాలా మందికి గ్రూప్​–1 ప్రిపరేషన్​ గురించి చాలా సందేహాలున్నాయి. ముఖ్యంగా ప్రిలిమ్స్​లో లాజికల్​ రీజనింగ్​, అనలిటికల్​ ఎబిలిటీ, డేటా ఇంట్రప్రిడిషన్​ టాపిక్స్​ ఎలా ప్రిపేర్​ కావాలి? గతంలో ప్రశ్నలెలా ఇచ్చారు? ప్రామాణిక పుస్తకాలు ఏవి? అనే అయోమయంలో ఉన్నారు. వీటన్నింటిపై ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం..

Advertisement

లాజికల్ రీజనింగ్​

లాజికల్​ రీజనింగ్​ సంబంధించి మార్కెట్​ లభ్యమయ్యే పుస్తకాల్లో వెర్బల్​, నాన్​వెర్బల్​, లాజికల్​/అనలిటికల్​ రీజనింగ్​ 3 రకాల సిలబస్​ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన గత పోటీ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల సరళిని చూస్తే లాజికల్​ రీజనింగ్​ విభాగంలో వెర్బల్​ రీజనింగ్​ ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. వీటితో పాటు అభ్యర్థులు నాన్​ వెర్బల్​ చాప్టర్లను కూడా ప్రిపేర్​ కావాలి.

వెర్బల్​ రీజనింగ్​లో భాగమైన కోడింగ్​, డీకోడింగ్​ వరుస క్రమ పరీక్ష, మిస్సింగ్​ క్యారెక్టర్కస్​, హ్యూమన్​ రిలేషన్​షిప్స్​, క్యాలెండర్​, భిన్న పరీక్ష, సీటింగ్​ అరేంజ్​మెంట్స్​, మొదలగు చాప్టర్​లు ప్రిపేర్​ కావాలి.

NOTE : లాజికల్​ రీజనింగ్​ అంటే వెర్బల్​ అండ్​ నాన్​ వెర్బల్​ రీజనింగ్​ అన్ని చాప్టర్లు ప్రిపేర్​ కావాలి

2014 తర్వాత జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నలను కింద గమనించండి.

Advertisement
 1. ఒక కోడ్​ భాషలో FTPDAQYRCX ను EQUGCOWBQX గా సూచిస్తే HANAMKONDA ను ఆ కోడ్​ భాషలో ఎలా సూచించాలి?

A.GYPIGFRIMA
B. GYBIOZCIMA
C.BOBIOOZCMN
D.BOBIOHACMN

(ANS-D)

 1. A,B,C,D,E,F అనే ఆరుగురు స్నేహితులు వృత్తాకారంలో మధ్యవైపునకు చూస్తూ కూర్చున్నారు. E, D కు ఎడమవైపున ఉన్నాడు. C, Aమరియు B మధ్య ఉన్నారు. F’ Eమరియు A మధ్య ఉన్నాడు. B కు ఎడమవైపున ఎవరు ఉన్నారు?

a. F
b. C
c. D
d. A

Advertisement

(ANS-D అనే వ్యక్తి)

3. కింద ఇచ్చిన నంబర్​ సిరీస్​ను పరిశీలించండి.
111తో ప్రారంభమై 201తో అంతమయ్యే ఈ సిరీస్​లో మొత్ం ఎన్ని సంఖ్యలు ఉంటాయి?
111, 114, 117, 120,…………………201

A. 30
B.31
C.32
D.33
(ANS-31)

Advertisement
 1. తన సోదరి నిషా పుట్టిన రోజు ఏప్రిల్​ నెలలో 19 తర్వాత 22కు ముందు అని నిషాకు గుర్తు కానీ ఆషా తండ్రికి నిషా పుట్టిన రోజు ఏప్రిల్​ నెలలో 20 తర్వాత, 24కు ముందు అని గుర్తుంది. అయితే నిషా పుట్టిన రోజు ఏప్రిల్​లో ఏ తేది?

A. 20
B. 23
C. 21
D.22

(ANS- ఏప్రిల్​ 21)
వివరణ: ఆషా ప్రకారం 19–––22 అనగా 20, 21 తేదీలు ఉంటాయి
తండ్రి ప్రకారం 20–––24 అనగా 21,22 తేదీలు ఉంటాయి. అయితే ఇద్దరు ఊహించిన దానిలో 21వ తేదీ కామన్​గా ఉంది కాబట్టి సరైన జవాబు 21గా గుర్తించాలి.

 1. కింద ఇచ్చిన సంఖ్య సిరీస్​లో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి?
  196, 169,144,121,100,80,64
  A.169
  B.144
  C.121
  D.80
  (ANS-80)
  వివరణ: అన్ని సంఖ్యలు, వర్గములు, కానీ 80 వర్గం కావు.
  196= 14
  169=13
  144=12
  121=11
  100=10
  64=8 ఇందులో 80 సంఖ్యకు వర్గం లేదు. మిగతా మూడు సంఖ్యలకు వర్గాలు ఉన్నాయి. కాబట్టి 80 జవాబు.

లాజికల్​ రీజనింగ్​ ప్రిపేర్​ కావడానికి తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్

కోడింగ్​, డీకోడింగ్​ చేయడానికి A—Z, Z—A వాటి యొక్క స్థానం తెలిసి ఉండాలి. ఉదా: A=1, M=13 వ్యతిరేక క్రమంలో A—Z, I—R , J—Q

Advertisement

వరుస క్రమ పరీక్ష, భిన్న పరీక్ష చేయడానికి 1 నుంచి 25 వరకు వర్గములు, ఘనములు, నోటెడ్​ ఉండాలి. తద్వారా పరీక్షలో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలం.

BODMAS రూల్​ క్యాలెండర్​ చాప్టర్​ షార్ట్​కట్స్​ కోడ్​లు గుర్తుంచుకోవాలి.

రక్త సంబంధాలు, దిశలు తెలిసి ఉండాలి. గతంలో పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చూసి అదే మోడల్​ ప్రశ్నలు ప్రాక్టీస్​ చేయాలి.

Advertisement

అనలిటికల్​ ఎబిలిటీ

ఈ విభాగంలో అనలిటికల్​ రీజనింగ్​ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో ప్రశ్నలు ఆలోచానాత్మకంగా ఉంటాయి. కాంపిటీటీవ్​ పరీక్షలకు నూతనంగా సన్నద్ధులయ్యే వారికి కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ నిరంతర సాధన చేస్తే తేలికగా జవాబులు గుర్తించవచ్చు.
అనలిటికల్​ ఎబిలిటీ ఉండే చాప్టర్స్​
1.ప్రకటనలు–ఊహనలు
2.ప్రకటనలు–తీర్మానాలు
3.జడ్జిమెంట్​
4.నిశ్చితం–కారణం
5.ప్రకటనలు–పర్యవసానాలు మొదలగునవి.

గతంలో ఇచ్చిన ప్రశ్నలను ఒకసారి పరిశీలిస్తే….

Advertisement
 1. కింది ప్రశ్నల్లో ఒక ప్రకటన మరియు రెండు నిర్ణయాలు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రకటనలు పూర్తి నిజంగా భావిస్తూ ఇవ్వబడిన నిర్ణయాలు. A మరియు Bలను పరిశీలించి ఏ నిర్ణయాలు ప్రకటన ఆధారంగా మరియు తర్కబద్ధంగా చేయబడ్డాయో గుర్తించాలి.

ప్రకటన: సాంకేతికత అభివృద్ధి చెందిన దశాబ్దంలో చాలా మంది వీడియో, సీడీలను ఉపయోగిస్తున్నారు.
నిర్ణయం: A: వీడియోలను ప్రజలు వారికి వీలైనప్పుడు చూడవచ్చు
B: తక్కువ ఖర్చుతో ఎక్కువ వీడియోలను, సినిమాలను చూడవచ్చు.

వీటిని పరిశీలించి తగిన సమాధానాన్ని గుర్తించండి.

 1. నిర్ణయం A మాత్రమే సరైనది
 2. నిర్ణయం B మాత్రమే సరైనది
 3. నిర్ణయం A కానీ B కానీ సరైనది కాదు
 4. నిర్ణయం A మరియు B రెండూ సరైనవే.

సమాధానం: 4

Advertisement

2. కింది ప్రశ్నల్లో ఒక ప్రకటన(Statement) మరియు రెండు భావించిన అంశాలు (Assumptions) A మరియు B ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగపడుతూ నిజాలుగా భావించిన అంశాలనే ’భావించిన అంశాలుగా‘ పేర్కొనవచ్చు. ఆ ఇచ్చిన ప్రకటన మరియు భావించిన అంశాలను పరిశీలించి ప్రకటన చేయడానికి ఏ అంశం లేదా అంశాలు భావించబడ్డాయో గుర్తించండి ?

ప్రకటన ; మీరు కంప్యూటర్​ ఇంజనీర్​ అయి ఉంటే ఈ సంస్థ మిమ్మల్నిఒక టీమ్​ లీడర్​గా కోరుకుంటోంది.

భావించిన అంశం; A. ఆ సంస్థకు ఒక టీమ్​ లీడర్​ అవసరముంది.
B. కంప్యూటర్​ ఇంజనీర్లు విజయవంతమైన టీమ్​ లీడర్స్​ అవుతారు.

Advertisement
 1. భావించిన అంశం A మాత్రమే సరియైనది
 2. భావించిన అంశం B మాత్రమే సరియైనది
 3. భావించిన అంశం A మరియు B రెండూ సరియైనవి
 4. భావించిన అంశం A కానీ B కానీ సరియైనది కాదు

సమాధానం: 1

3, ఇచ్చిన ప్రశ్నలో ఒక ప్రకటన (Statement), రెండు తీనుకోవలనిన చర్యలు (Courses of Action)
ఇవ్వబడ్డాయి. తీసుకోవలసిన చర్య ప్రకటనలోని సమస్యకు వరిష్కారం చూవుతూ పాలనా
సౌలభ్యంగాను, అమలుకు వీలుగానూ ఉండాలి. వ్రకటనలో పేర్కొన్న అంశాలను నిజాలుగా
భావించాలి. ఇచ్చిన ప్రకటనను, తీసుకోవలసిన చర్యలను పరిశీలించిన పిదప మీరు తీసుకున్న
నిర్ణయాన్ని సరైన సమాధానంగా గుర్తించండి.

ప్రకటన : గత ఏడాదిలో సైబర్‌ నేరాలు ఎన్నో రెట్లు అధిదకమయ్యాయి – సీనియర్‌ పోలీస్‌ అధికారి.
తీసుకోవలసిన చర్య -1 : ప్రభుత్వం వెంటనే అన్ని ఇ-కామర్స్‌ పోర్టల్ని ఆపివేయాలి.
తీసుకోవలసిన చర్య -2 : సైబర్‌ నేరాలు పెరగడంతో కంపెనీలు ఆధునిక సైబర్‌ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను అలాగే డేటా విశ్లేషకులను
(సైబర్‌ నేరగాళ్ళు ఉపయోగించే నమూనాలను అర్ధం చేసుకోవడానికి) వెంటనే నియమించుకోవాలి.

 1. తీసుకోవలసిన చర్య -2 మాత్రమే.
 2. తీసుకోవలసిన చర్య -1 & తీసుకోవలసిన చర్య-2
 3. తీసుకోవలసిన చర్య-1 మాత్రమే
 4. ఇచ్చిన రెండు తీసుకోవలసిన చర్యలు కావు

సమాధానం: 1

4. క్రింది ప్రశ్నలో ఒక ప్రకటన (Statement) మరియు రెందు నిర్ణయాలు (Conclusions) ఇవ్వబడ్డాయి.
ఇచ్చిన ప్రకటనలు వాస్తవ విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆ ప్రకటనలను పూర్తి నిజంగా భావిస్తూ ఇవ్వబడిన
నిర్ణయాలు మరియు లను పరిశీలించి, ఏ నిర్ణయం / నిర్ణయాలు ప్రకటన ఆధారంగా మరియు తర్మబద్ధంగా చేయబడినవో గుర్తించండి.
ప్రకటన : భారత రాజకీయాలలో ధనం ముఖ్య పాత్ర వహిస్తుంది.
A: ఒక పేద భారతీయుదెన్నడూ రాజకీయ వేత్త కాలేడు.
B: భారతదేశంలో ధనికులందరూ రాజకీయాలలో
ఉన్నారు.

వీటిని పరిశీలించి కింది నాల్గింటిలో తగిన సమాధానాన్ని గుర్తించండి?

1. నిర్ణయములు A మరియు B రెండూ సరియైనవి
2. నిర్ణయం B మాత్రమే సరియైనది
3. నిర్ణయం A మాత్రమే సరియైనది
4 నిర్ణయం A కానీ B కానీ సరియైనది కాదు

సమాధానం: 4

డేటా ఇంటర్​ ప్రిటేషన్​

డేటా ఇంటర్​ప్రిటేషన్​లో భాగంగా టేబుల్స్​, బార్​గ్రాఫ్స్​, పైచార్ట్స్​, లైన్​ గ్రాఫ్స్​ రూపంలో సమాచారం ఇచ్చి వాటి ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు.

రిఫరెన్స్​ బుక్స్​

 1. రీజనింగ్​: ఆర్​ఎస్​ అగర్వాల్​ (ఇంగ్లీష్​),
 2. రాజు కొమకాల(తెలుగుమీడియం)
 3. అర్థమెటిక్​–ఆర్​ఎస్​ అగర్వాల్​(ఇంగ్లీష్​)
 4. అనలిటికల్​ రీజనింగ్​ –ఎం.కే పాండే
 5. క్విక్​ అర్థమెటిక్​–అశ్విన్​ అగర్వాల్​

RECENT POSTS

2 COMMENTS

 1. Superb

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!