కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. KVS నుంచి రెండు భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 13,404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రైమరీ టీచర్ పోస్టుకలు సంబంధించి 6414 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదల కాగా.. మరో 6,990 ఖాళీలతో ఇంకో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో టీజీటీ (TGT), పీజీటీ (PGT), సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్, ఇతర వివిధ పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం : 05-12-2022
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-12-2022
విద్యార్హతల వివరాలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా CTET పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. ఇంకా వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అధికారిక వెబ్ సైట్: https://kvsangathan.nic.in/
– దరఖాస్తుకు సంబంధించిన లింక్ ఈ నెల 5వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి యాక్టివేట్ అవుతుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.