Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSబీటెక్ చేసిన వారికి రూ.1.40 లక్షల జీతం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బీటెక్ చేసిన వారికి రూ.1.40 లక్షల జీతం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లోని ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాల్లో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజగా నోటిఫికేషన్ విడుదల చేసింది AAI. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఖాళీల వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్): 62 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్): 84 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రానిక్స్): 440 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఆర్కిటెక్చర్): 10 పోస్టులు
మొత్తం ఖాళీలు: 596

విద్యార్హతల వివరాలు: సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు జనవరి 21 నాటికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
అధికారిక వెబ్ సైట్: http://www.aai.aero/

వేతనాలు: ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల వేతనం ఉంటుంది.

Advertisement

అభ్యర్థుల ఎంపిక: గేట్ 2020/21/22 స్కోర్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!