ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 8న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Registration) చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.9,400 నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది.
ఖాళీల వివరాలు:
Radiant Applications Electronics Pvt Ltd: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఇంకా నవత ట్రాన్స్ పోర్ట్, సంతోష్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో 85 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలక రూ.9400 నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, కైకలూరు, తిరువూరు, హనుమాన్ జంక్షన్, మణుగూరు, గొల్లపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఇంటర్వ్యూలను NAC Training Centre, Near Collectorate, Lingampgutla, Narasaraopeta, Palnadu Dist చిరునామాలో నిర్వహించనున్నారు.
-అభ్యర్థులు ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇతర వివరాలకు 9494064634, 6302096189 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ok
Hii
Hi
Ok
Ok
IAM ASK AA JOB