ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 465 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెస్ట్రన్, నార్తెర్న్, సదరన్, ఈస్ట్రన్, సౌత్ ఈస్టర్న్ రీజియన్లలో ఈ ఖాళీలు (Jobs) ఉన్నాయి. మొత్తం 465 ఖాళీల్లో అన్ రిజర్వరడ్ కేటగిరీ కింద 233 ఖాళీలు ఉన్నాయి. ఇంకా ఎస్సీ అభ్యర్థులకు 63, ఎస్టీలకు 34, ఓబీసీలకు 96, ఈడబ్ల్యూఎస్-39 ఖాళీలను కేటాయించారు. మెకానికల్, ఎలక్ట్రికల్, టీ&ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
ఇంటర్ లేదా సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత సాధించిన వారు అర్హులు.ఈ నెల 10వ తేదీ నాటికి అభ్యర్థులకు 18 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వెబ్ సైట్: https://plapps.indianoil.in/