ఇండియన్ నేవీ (Indian Navy) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (SSR) ద్వారా అగ్నివీర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. అయితే.. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంకా వయోపరిమితి విషయానికి వస్తే అభ్యర్థులు తప్పనిసరిగా 01 మే 2002 – 31 అక్టోబర్ 2005 మధ్య జన్మించి ఉండాలని సూచించారు.
అధికారిక వెబ్ సైట్ – LINK
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 550 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.