తెలంగాణలో టీఎస్పీఎస్సీ TSPSC మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ పరిధిలో ఈ ఖాళీలున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనుంది. తగిన అర్హతలున్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అప్లికేషన్ ప్రొఫార్మాను టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో (tspsc.gov.in) అప్లోడ్ చేయనుంది. గురువారం సాయంత్రం టీఎస్పీఎస్సీ ఈ ప్రకటన విడుదల చేసింది.