HomeLATESTడిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంక్ లో 600 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంక్ లో 600 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ఐడీబీఐ బ్యాంక్ (IDBI Jobs) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీని చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 600 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది బ్యాంక్. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది బ్యాంక్. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Advertisement

విద్యార్హతలు:
ఈ 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ లో ఆన్లైన్ టెస్ట్ ఉండే అవకాశం ఉందని బ్యాంక్ తెలిపింది.

అప్లికేషన్ స్టెప్స్:

Step 1: మొదటగా బ్యాంక్ వెబ్ సైట్ https://www.idbibank.in/ను సందర్శించాలి.

Advertisement

Step 2: తర్వాత careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం Current Openings ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 4: నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Advertisement

Step 5: అనంతరం రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. వివరాలను నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.

Step 6: తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపి సబ్మిట్ చేసుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!