హైదరాబాద్‌లోని రాణిగంజ్‌లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో ధ్రువ్ కన్సెల్టింగ్ సర్వీస్ ఫిబ్రవరి 26 ( శనివారం) మెగా జాబ్‌మేళా నిర్వహిస్తుంది. 25కు పైగా కంపెనీలు ఇందులో అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి వస్తున్నాయి. 5000 పైగా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, అపోలా, పీవీఆర్, ప్లిఫ్‌కార్ట్, స్విగ్గీ లాంటి టాప్ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి.
అర్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, పీజీ, ఫార్మసీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 26 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే జాబ్‌మేళా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం.
అడ్రస్: యూత్ హాస్టల్, బోట్స్ క్లబ్ దగ్గర, రాణిగంజ్, సికింద్రాబాద్ – 500003ను సంప్రదించాలి. పూర్తి సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్స్: 7097655912, 9030047303 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. రిజిస్ర్టేషన్ కోసం https://forms.gle/aWH1uo5poS6RrT3D6 వెబ్సైట్లో లాగిన్ అయ్యి అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
