HomeLATESTపాలీసెట్​కు ఎలా ప్రిపేరవ్వాలి.. 20 డేస్​ ప్లాన్​

పాలీసెట్​కు ఎలా ప్రిపేరవ్వాలి.. 20 డేస్​ ప్లాన్​

టీఎస్‌పాలిసెట్ – 2020

Advertisement

కరోనా టైమ్​ లో వాయిదా పడ్డ సెట్టు అన్నింటిలో రాష్ట్రంలో మొదటగా నిర్వహించే ఎంట్రన్స్ పాలీసెట్​. సెప్టెంబర్​ 2న ఈ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టెన్త్ పూర్తి కాగానే చిన్న వయసులో బెస్ట్ కెరీర్​ ను డిజైన్​ చేసకునేందుకు పాలిటెక్నిక్‍ కోర్సు బెస్ట్ రూట్. పాలిటెక్నిక్​ పూర్తయితే బీఈ /బీటెక్‍ కు సమానంగా నిలిచే ఇంజినీరింగ్‍/నాన్‍ఇంజినీరింగ్ అండ్‍టెక్నాలజీలో డిప్లొమా కోర్సులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలుండే కొలువు పొందవచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలంటే పాలిటెక్నిక్‍ కామన్‍ ఎంట్రన్స్​ టెస్ట్ (టీఎస్‍పాలీసెట్‍) లో మంచి ర్యాంక్​ సాధించాలి. ఎంట్రన్స్​కు మరో 20 రోజుల టైమ్​ మాత్రమే మిగిలి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ పరీక్షకు విద్యార్థులు వెంటనే రివిజన్​ స్టార్ట్ చేయాలి. ఈ టైమ్​లో స్పీడ్​గా ఎలా ప్రిపేర్​ కావాలి.. ఏయే సబ్జెక్టులపై ఫోకస్​ పెట్టాలనే వివరాలు మీకోసం..

ఎగ్జామ్​ పాటర్న్​

మొత్తం150 మార్కులకు ఆబ్జెక్టివ్​ తరహాలో పరీక్ష ఉంటుంది. డ్యురేషన్​ 150 నిమిషాలు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్​ షీట్​లో ఆన్సర్​ను బబ్లింగ్​ చేయాల్సి ఉంటుంది. తప్పు సమాధానానికి ఎటువంటి నెగెటివ్​ మార్కింగ్​ ఉండదు.

  • సబ్జెక్టు                     ప్రశ్నలు            మార్కులు  
  • మ్యాథమెటిక్స్           60                     60
  • ఫిజిక్స్                      30                     30
  • కెమిస్ట్రీ                     30                     30
  • బయాలజీ                  30                     30
  • మొత్తం                     150                   150

క్వాలిఫైయింగ్​ మార్క్స్​:

ఇంజినీరింగ్&నాన్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్​​: మ్యాథ్స్​(60)+ఫిజిక్స్​(30)+కెమిస్ట్రీ(30)=120 మార్కులు

Advertisement

అగ్రికల్చరల్ పాలిటెక్నిక్​: మ్యాథ్స్​(60/2)+ఫిజిక్స్​(30)+కెమిస్ట్రీ(30)+బయాలజీ(30)‌‌=120 మార్కులు

ఇంజినీరింగ్​, నాన్​ఇంజినీరింగ్​ పాలిటెక్నిక్​ కోర్సుల్లో చేరాలనుకునే వారు బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలను అటెంప్ట్ చేయవాల్సిన అవసరం లేదు. ఆ మార్కులను పరిగణలోకి తీసుకోరు.పాలీసెట్ క్వాలిఫై అవ్వాలంటే అన్ని సబ్జెక్టుల్లో కలిపి కనీసం 30 శాతం (అనగా మొత్తం 120 మార్కులకు 36 మార్కులు) సాధించాలి.

పాలీసెట్‍ద్వారా రాష్ర్టవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 కు పైగా ప్రభుత్వ, ఎయిడెడ్‍, ప్రైవేటు, అన్‍ఎయిడెడ్‍పాలిటెక్నిక్‍కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. మన రాష్ర్టవ్యాప్తంగా 181 ప్రభుత్వ పాలిటెక్నిక్‍కాలేజీల్లో మొత్తం 45910 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

మంచి ర్యాంక్​ రావాలంటే ఇలా చదవండి

మ్యాథమెటిక్స్

  • పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో మ్యాథ్స్ సబ్జెక్టుకు అధిక వెయిటేజీ ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ మార్కుల  సాధించడం  కీలకం.
  • ప్రశ్నలన్నీ పదోతరగతి పుస్తకం నుంచే వస్తాయి కాబట్టి సిలబస్‍ను పూర్తిగా చదవాలి. మొదట పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళి గమనించాలి.
  • ప్రశ్నలు ఎక్కువగా అప్లికేషన్ పద్ధతిలో వస్తుంటాయి.
  • కష్టతరంగా అనిపించే శ్రేఢులు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, నిరూపక రేఖాగణితం, సరూప త్రిభుజాలు, త్రికోణమితి, త్రికోణమితి అనువర్తనాలు, క్షేత్రమితి వంటి చాప్టర్లను మొదట ప్రాక్టీస్‍చేయాలి.
  • అనంతరం వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, వర్గసమీకరణాలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం వంటి సులువైన చాప్టర్లను ప్రిపేరవ్వాలి.
  • ప్రతి చాప్టర్లోని ఫార్ములాలను ఒకచోట రాసుకొని సాధన చేస్తే మంచిది.
  • కఠినంగా ఉండే పాఠ్యాంశాలను కనీసం రెండు సార్లు పునశ్చరణ చేయగలగాలి.
  • షార్ట్‌కట్ పద్ధతి, ఆప్షన్స్ నుంచే జవాబును రాబట్టే విధానాలను బాగా ప్రాక్టీస్ చేస్తూ వీలైనన్ని మోడల్ పేపర్లు రాయాలి.

పాలిటెక్నిక్​ గత రెండేళ్ల ప్రశ్నాపత్రాలు (సమాధానాలతో).. డౌన్​ లోడ్​ చేసుకొండి

Click HERE TO DOWNLOAD
POLYCET Previous Question Papers 2019 2018 with Key

ఫిజికల్ సైన్స్

Advertisement
  • ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కో విభాగంలో 30 మార్కుల చొప్పున 60 ప్రశ్నలు వస్తాయి.
  • విద్యుత్, ఉష్ణం అంశాలు చాలా ముఖ్యమైనవి. వీటిని పూర్తిగా అధ్యయనం చేయాలి.
  • ముఖ్యంగా చాప్టర్‍చివర ఉండే సమస్యల (ప్రాబ్లమ్స్) నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు.
  • అలాగే ప్రమాణాలు, భౌతిక స్థిరాంక విలువలు, సూత్రాలు, పరికరాలు-ఉపయోగాలు, బాయిల్ నియమం, జౌల్ నియమం, శాస్త్రవేత్తలు- ఆవిష్కరణలు, ఉదాహరణలు, కారణ సంబంధ ఫలితాలు తప్పకుండా చదవాలి.
  • కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం, లోహ సంగ్రహణ శాస్త్రం, పరమాణు నమూనాలు, మూలకాలు-ఆవర్తన పట్టికలో వాటి స్థానాలు, వివిధ అణువులు-ఆకృతులు, రసాయన ఫార్ములాలు, ఐయూపీఏసీ నామీకరణం అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి.
  • వివిధ ధాతువులు-వాటి ఫార్ములాలు, రసాయన తుల్యసమీకరణాలు, ఆక్సీకరణం- క్షయకరణం టాపిక్‍లను ప్రీవియస్‍ పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా చదవాలి.
  • ప్రిపరేషన్‍లోనే సొంతంగా నోట్స్ రాసుకుంటే పరీక్షకు ముందు రివిజన్‍ సులువవుతుంది.

పాలిటెక్నిక్​ గత రెండేళ్ల ప్రశ్నాపత్రాలు (సమాధానాలతో).. డౌన్​ లోడ్​ చేసుకొండి

Click HERE TO DOWNLOAD
POLYCET Previous Question Papers 2019 2018 with Key

లేటరల్​ ఎంట్రీ ద్వారా బీటెక్​


ఈ పరీక్షను రెండు రాష్ర్టాలకు ప్రత్యేకంగా నిర్వహిస్తారు కాబట్టి స్టేట్‍వైడ్‍(ఏపీ) ఇన్‍స్టిట్యూషన్స్‌లో ప్రవేశం పొందాలనుకునే  తెలంగాణకు చెందిన విద్యార్థులకు ఏయూ : ఓయూ : ఎస్‌వీయూ రీజియన్ల పరిధిలో 42:36:22 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు. లేదా ఏపీలోని పాలిటెక్నిక్‍కాలేజీల్లో 15 శాతం ఓపెన్‍కోటాలో సీటు పొందాలనుకునే అభ్యర్థులు ఆ రాష్ర్టం నిర్వహించే పాలీసెట్‍పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఇదే విధానం ఏపీ విద్యార్థులకు వర్తిస్తుంది. డిప్లొమా ఇన్‍హోటల్‍మేనేజ్‍మెంట్‍అండ్ కేటరింగ్‍టెక్నాలజీ, డిప్లొమా ఇన్‍ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాయనవసరం లేదు. అందుకు ప్రత్యేక నోటిఫికేషన్‍విడుదల చేస్తారు.

Advertisement

పాలిటెక్నిక్‍ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.  సంస్థను బట్టి ప్రారంభంలోనే నెలకు రూ.18 వేలకు పైగా వేతనం లభిస్తుంది. సూపర్‌వైజరీ స్థాయి పోస్టుల్లో పాలిటెక్నిక్ అభ్యర్థులకే కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. కార్పొరేటు కంపెనీలు, ఇండస్ర్టీలు ఇంజినీరింగ్‍ కాలేజీల్లాగే పాలిటెక్నిక్‍ల్లోనూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తుంటాయి. కాబట్టి డిప్లొమా సర్టిఫికెట్లు పొందిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం గ్యారంటీ అని చెప్పవచ్చు. వీటికి తోడుగా స్వయం ఉపాధిలో మల్టిపుల్‍ ఆపర్చునిటీస్‍ ఉన్నాయి. ఉన్నత చదువులు చదవాలనుకునేవారు బీటెక్/బీఈ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ స్కీం (ఈసెట్‍ రాయడం) ద్వారా నేరుగా సెకండియర్‌లో ప్రవేశించవచ్చు. కేంద్ర రాష్ర్ట స్థాయిల్లోని  పలు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.

మూడేళ్ల కోర్సులు:

సివిల్ ఇంజినీరింగ్‍: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని సాగునీరు, ప్రజారోగ్యం, రోడ్లు, రైల్వేలు, బిల్డింగ్స్ సర్వే, డ్రాయింగ్‍తాగునీటి సరఫరా మొదలైన వాటితో పాటు పైన పేర్కొన్న వాటిలో కాంట్రాక్టర్లుగా, డ్రాఫ్ట్‌మెన్‌గా స్వయం ఉపాధి పొందవచ్చు.

ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్: డిజైన్‍అండ్‍డ్రాయింగ్ డిపార్ట్‌మెంట్లతో పాటు ఆర్కిటెక్చర్‍లో డ్రాఫ్ట్‌మెన్స్‌గా స్వయం ఉపాధి పొందవచ్చు. మునిసిపల్‍ఆఫీసుల్లో లైసెన్స్‌డ్‍డిజైనర్‍గా కెరీర్‍ప్రారంభించవచ్చు.

Advertisement

మెకానికల్ ఇంజినీరింగ్‍: మెషినరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్లు, సేల్స్‌తో సంబంధమున్న ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు వర్క్‌షాప్‍లు, గ్యారేజీల్లో అవకాశాలు లభిస్తాయి. యాన్సిలరీ యూనిట్లు, సేల్స్ ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు.

ఆటోమొబైల్ ఇంజినీరింగ్‍: టీఎస్‍ఆర్టీసీ, ఆటోమొబైల్‍షోరూమ్స్, రోడ్‍ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు సేల్స్ అండ్‍సర్వీస్‍లో స్వయం ఉపాధి అవకాశాలుంటాయి.                     

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‍: టీఎస్‍జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎలక్ర్టికల్‍కాంట్రాక్టర్లు, మెయింటెన్స్ స్టాఫ్‍వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేయవచ్చు. ఎలక్ట్రిక్ టెక్నీషియన్లు, వైండర్లుగా స్వయం ఉపాధిని పొందవచ్చు                       

Advertisement

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‍: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో పాటు  రేడియో, టీవీ మెయింటెనెన్స్ అండ్‍సర్వీసింగ్‍, సేల్స్ అండ్‍సర్వీసెస్‍లో స్వయం ఉపాధి పొందవచ్చు.               

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‍: ప్రెస్‍, ఎలక్ర్టానిక్‍, ఫార్మాస్యూటికల్‍పరిశ్రమలతో పాటు ఎలక్ర్టానిక్‍ఇన్‍స్ర్టుమెంట్స్  సేల్స్ అండ్‍సర్వీస్‍లో స్వయం ఉపాధి అవకాశాలుంటాయి. 

కంప్యూటర్ ఇంజినీరింగ్‍: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి వాటితో పాటు కంప్యూటర్ సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో స్వయం ఉపాధి అవకాశాలుంటాయి.                                      

Advertisement

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: సాఫ్ట్‌వేర్‍డెవలప్‍మెంట్‍కు సంబంధించిన అన్ని యూనిట్లు              

మైనింగ్ ఇంజినీరింగ్‍: సింగరేణి, ఎన్‍ఎండీసీ వంటి ఓపెన్‍క్యాస్ట్ అండ్‍అండర్‍గ్రౌండ్ మైనింగ్‍సంస్థల్లో అవకాశాలు              

కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్‍: ప్రభుత్వ విభాగాల్లో స్టెనో/టైపిస్ట్/కంప్యూటర్‍ఆపరేటర్‍తో పాటు ప్రైవేటు, స్వయం ఉపాధిలో అద్భుత అవకాశాలున్నాయి.

Advertisement

గార్మెంట్ టెక్నాలజీ: టెక్స్‌టైల్‍మిల్స్, క్లాత్స్ ఎక్స్‌పోర్ట్ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి. సొంత గార్మెంట్ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు.      

క్రాఫ్ట్ టెక్నాలజీ: ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్‍తో పాటు ఫుడ్‍, టెక్స్‌టైల్‍, బ్యూటీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి.                       

హోమ్‌సైన్స్: హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్‍, ఫుడ్‍, టెక్స్‌టైల్‍, బ్యూటీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి

మెటలర్జికల్‍ఇంజినీరింగ్‍: ఫౌండ్రీ, ఫోర్జ్ షాప్స్, స్టీల్‍ ప్లాంట్స్, రోలింగ్‍మిల్స్, హీట్‍ట్రీట్‍మెంట్‍షాప్స్, డిఫెన్స్ సంస్థలు వంటి వాటిలో అద్భుత అవకాశాలుంటాయి.

కెమికల్ ఇంజినీరింగ్‍(శాండ్‍విచ్‍): రీఫైనరీ, పెట్రోకెమికల్‍, షుగర్‍, పేపర్‍, ఫుడ్‍ప్రాసెసింగ్‍అండ్‍కెమికల్‍ఇండస్ర్టీస్‍లో ఉద్యోగావకాశాలుంటాయి.

మూడున్నరేళ్ల కోర్సులు:

కంప్యూటర్ ఇంజినీరింగ్‍: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్ వంటి వాటితో పాటు కంప్యూటర్ సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో స్వయం ఉపాధి అవకాశాలుంటాయి

ఎంబెడ్డెడ్ సిస్టమ్స్: ఎలక్ర్టానిక్‍ఐసీ సర్క్యూట్‍ల తయారీ పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‍: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో పాటు  రేడియో, టీవీ మెయింటెనెన్స్ అండ్‍సర్వీసింగ్‍, సేల్స్ అండ్‍సర్వీసెస్‍లో స్వయం ఉపాధి దొరుకుతుంది.

ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్: ప్రాసెస్‍, ఎలక్ర్టానిక్‍, ఫార్మాస్యూటికల్‍ఇండస్ర్టీస్‍లో ఉద్యోగావకాశాలతో పాటు స్వయం ఉపాధి దొరుకుతుంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్‍: ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రైవేటు టీవీ స్టేషన్లు, ప్రభుత్వ, కార్పొరేటు హాస్పిటల్స్‌లో అవకాశాలుంటాయి.

బయోమెడికల్ ఇంజినీరింగ్‍: మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‍లు మరియు ఆసుపత్రులు

లెదర్ టెక్నాలజీ: ఫుట్‌వేర్ పరిశ్రమలు, ట్యానింగ్

ఫుట్‌వేర్ టెక్నాలజీ: ఫుట్‍వేర్‍టెక్నాలజీ అండ్‍లెదర్‍గూడ్స్, ఫుట్‍వేర్‍తయారీ యూనిట్లు

టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్‍మిల్స్, క్లాత్స్ ఎక్స్‌పోర్ట్ పరిశ్రమలతో పాటు సొంత గార్మెంట్ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు.             

ప్రింటింగ్ టెక్నాలజీ: డీటీపీ, ఫిల్మ్‌మేకింగ్‍, ప్రింటింగ్‍లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలున్నాయి.

ప్యాకేజింగ్ టెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, శీతల పానీయాలు, ఆహార శుద్ధి యూనిట్లు, పేపర్‍, ప్లాస్టిక్‍ పరిశ్రమలు

కెమికల్ ఇంజినీరింగ్‍(షుగర్ టెక్నాలజీ): పేపర్‍, షుగర్‍, పెట్రోకెమికల్‍, ప్లాస్టిక్‍అండ్‍ఫుడ్‍ప్రాసెసింగ్‍యూనిట్లు

పాలిటెక్నిక్​ గత రెండేళ్ల ప్రశ్నాపత్రాలు (సమాధానాలతో).. డౌన్​ లోడ్​ చేసుకొండి

Click HERE TO DOWNLOAD
POLYCET Previous Question Papers 2019 2018 with Key

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!