హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ టెక్ బీ (TECH BEE) ఇంటెర్న్ షిప్ ప్రోగ్రాం నోటిఫికేషన్ విడుదల చేసింది. మ్యాథ్స్ సబ్జెక్ట్ తో ఇంటర్ లేదా 10+2 పాస్ అయిన విద్యార్థులు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హులు. ఈ ట్రెయినింగ్ ప్రోగ్రాం లో నెలకు 10 వేల రూపాయలు స్టైఫండ్గా అందిస్తారు. సాఫ్ట్ వేర్ డెవెలపర్, అనలిస్ట్. డిజైన్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సపోర్ట్ అండ్ ప్రాసెస్ అసోసియేట్ జాబ్లకు సంబంధించిన ట్రైనింగ్ అందిస్తారు. ఈ ట్రైనింగ్ ఏడాది పాటు కొనసాగుతుంది. ట్రైనింగ్ తో పాటు గ్రాడ్యుయేషన్ చేసేందుకు వీలు కల్పిస్తారు. పూర్తి వివరాలు హెచ్ సీ ఎల్ వెబ్ సైట్ లో చూడవచ్చు.