Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSహెచ్ఏఎల్​ లో 2000 అప్రెంటిస్​ ఖాళీలు

హెచ్ఏఎల్​ లో 2000 అప్రెంటిస్​ ఖాళీలు

బెంగ‌ళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్ఏఎల్‌).. 2000 ట్రేడ్‌అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్స్​: హెచ్ఆర్‌డీ ప్రోగ్రాం/ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం, ట్రేడ్ అప్రెంటిస్‌/ సూప‌ర్‌వైజ‌రీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం; అర్హత‌: స‌ంబంధిత విభాగాల్లో ఎన్ఏసీ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు పని అనుభ‌వం. సబ్జెక్ట్​ నాలెడ్జ్​, ప్రాక్టికల్ కమ్యూనికేషన్​, ప్రజెంటేషన్​ స్కిల్స్​ కలిగి ఉండాలి. ఈ–మెయిల్‌: tti@hal-india.co.in; చివ‌రి తేది: 2020 సెప్టెంబర్​ 5; వివరాలకు: www.hal-india.co.in

Advertisement

ఎస్ఈసీఆర్‌లో 432 అప్రెంటిస్​

సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే, బిలాస్​పూర్ డివిజన్.. 432 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్​–ఖాళీలు: సీఓపీఏ–90, స్టెనోగ్రాఫ‌ర్‌–50,  ఫిట్టర్‌–80, ఎలక్ట్రిషియ‌‌న్‌–50, వైర్‌మెన్‌–50, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌–06, ఆర్​ఏసీ మెకానిక్​–06, వెల్డర్‌–40, ప్లంబ‌ర్‌–10, మ్యాసన్​–10, పెయింటర్​–05, కార్పెంటర్​–10, మెషినిస్ట్​–05, టర్నర్​–10, షీట్​ మెటల్​ వర్కర్​–10; అర్హత‌: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌; వయసు: 2020 జులై 1 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్​: అకడమిక్​ మెరిట్ ఆధారంగా; చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 30; వివరాలకు: www.secr.indianrailways.gov.in

హెచ్‌సీఎల్‌లో..

హిందుస్థాన్ కాప‌ర్ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) పరిధిలోని త‌లోజా కాప‌ర్ ప్రాజెక్ట్.. 8 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్​–ఖాళీలు: ఫిట్టర్‌–04, ట‌ర్నర్‌–01, ఎల‌క్ట్రీషియ‌న్‌–03; అప్రెంటిస్​ వ్యవధి: ఏడాది; అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత‌; వయసు: 2020 ఆగస్ట్​ 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్: రాత‌ప‌రీక్ష ద్వారా; చివ‌రి తేది: 2020 సెప్టెంబర్​ 7; వివరాలకు: www.hindustancopper.com

హెచ్ఈసీఎల్‌లో 164 ట్రెయినీ పోస్టులు

రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేష‌న్ లిమిటెడ్(హెచ్ఈసీఎల్‌).. క్రాఫ్ట్స్‌మెన్​షిప్​ ట్రెయినింగ్ స్కీం కింద 164 ట్రెయినీ ఖాళీల భ‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్​–ఖాళీలు: ఎల‌క్ట్రీషియ‌న్‌–20, ఫిట్టర్‌–40, మెషినిస్ట్‌–16, వెల్డర్‌–40, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ క‌మ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌(కోపా)–48; అర్హత‌: ఎనిమిదో తరగతి, ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌; వ‌య‌సు: 2020 జులై 31 నాటికి 14–40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివ‌రి తేది: 2020 ఆగస్ట్​ 29; వివరాలకు: www.hecltd.com

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!