HomeLATESTజీఏటీ–బీ, బీఈటీ–2022 నోటిఫికేషన్​

జీఏటీ–బీ, బీఈటీ–2022 నోటిఫికేషన్​

బయో టెక్నాలజీ విభాగాల్లో పీజీ ప్రవేశాలు, జూనియర్​ రీసెర్చ్​ ఫెలోషిప్​ల కోసం నిర్వహించే – గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ (GAT-B), బయో టెక్నాలజీ ఎలిజిబులిటీ టెస్ట్​(BET) నోటిఫికేషన్​ విడుదలైంది. దీనిని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.

బయోటెక్నాలజీ ఎలిజిబులిటీ టెస్ట్​ (BET)

ఈ ఎగ్జామ్​ రాసేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/బీటెక్​/ ఎంబీబీఎస్​ ఉత్తీర్ణతతో పాటు బయో టెక్నాలజీ/ లైఫ్​ సైన్సెస్​, బయో మెడికల్​/ బయో ఇన్ఫర్మాటిక్స్​/బయో కెమిస్ట్రీ/బయోఫిజిక్స్​/బోటనీ/కెమిస్ట్రీ/కంప్యూటేషనల్​ బయాలజీ/జెనెటిక్స్​/మైక్రో బయాలజీ/జువాలజీ స్పెషలైజేషన్​లతో ఎమ్మెస్సీ/ఎంటెక్​/ఎంవీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్​ ఎమ్మెస్సీ పూర్తి చేసిన వార్హులు అర్హులు. వయసు జనరల్​ అభ్యర్థులు 28 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 33 ఏళ్లు మించి ఉండరాదు.

ఎలిజిబులిటీ టెస్ట్​ రెండు సెక్షన్లలో మల్టీపుల్​ చాయిస్​ విధానంలో నిర్వహిస్తారు. మొదటి సెక్షన్​లో జనరల్​ సైన్స్​, మేథమేటిక్స్​, కెమిస్ట్రీ, జనరల్​ ఆప్టిట్యూడ్​, అనలిటికల్​ క్వాంటిటేటివ్​ ఎబిలిటీ, జనరల్​ బయోటెక్నాలజీ అంశాల నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. రెండు సెక్షన్​లో బయో టెక్నాలజీ అంశాల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో కేవలం 50 ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, తప్పు జవాబుకు ఒక మార్కు కోత ఉంటుంది. పరీక్షా సమయం 3గంటలు ఉంటుంది.

గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​(జీఏటీ–బీ)

ఈ ఎగ్జామ్​ రాసేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ, బీటెక్​, ఉత్తీర్ణులు అర్హులు. ఎగ్జామ్​లో అర్హత సాధించిన వారు యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​, ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, ఎంవీఎస్సీ, యానిమల్​ బయో టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్​ పొందవచ్చు. మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

జీఏటీ–బీ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ కంప్యూటర్​ బేస్డ్​ విధానంలో నిర్వహిస్తారు. మల్టీపుల్​ చాయిస్​ విధానంలో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్​లో ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథ్స్​, బయాలజీ సబ్జెక్టుల నుంచి ఇంటర్మీడియేట్​ స్థాయిలో 60 ప్రశ్నలు, రెండో సెక్షన్లో బయాలజీ, లైఫ్​ సెన్సెస్, బయో టెక్నాలజీ విభాగాల నుంచి డిగ్రీ స్థాయిలో 100 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 60 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతోంది. నెగిటీవ్ మార్కింగ్​ ఉంటుంది. అర్హత పొందిన విద్యార్థులకు ప్రతి నెల స్టైఫెండ్​ చెల్లిస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 చివరితేది. జనరల్​ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.6‌‌00 చెల్లించాలి. జీఏటీ–బీ, బీఈటీ పరీక్షను ఏప్రిల్​ 23న నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్​, సికింద్రాబాద్​, గుంటూరు, నెల్లూరులో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

వెబ్​సైట్​ : www.dbt.nta.ac.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!