తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎంట్రన్స్ జరుగుతుంది. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 102 సెంటర్లు నెలకొల్పారు. తెలంగాణ లో 79 ఏపీలో 23పరీక్ష కేంద్రాలు నెలకొల్పుతున్నారు. మొత్తం 1.43 లక్షల మంది అభ్యర్థులు ఎంట్రన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ పరీక్షకు దరఖాస్తు చేయని విద్యార్థులకు రూ.10వేల అపరాధ రుసుముతో సెప్టెంబర్ 5వ తేదీ వరకు అప్లై చేసుకునే వీలుంది.
వెబ్సైట్లో హాల్‌టికెట్లు
ఈనెల 3 వ తేదీ నుంచి 7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. శానిటైజర్ వాడాలి.
మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి
కంప్యూటర్ బెస్డ్ టెస్టు ప్రాక్టీస్ చేసేందుకు అధికారిక వెబ్సైట్లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంది. విద్యార్థులు తమ అవగాహన పెంచుకునేందుకు ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసుకోవటం బెటర్.
మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి
https://g21.digialm.com//OnlineAssessment/instructions.html?2000@@M9
DOWNLOAD CONVENOR PRESS NOTE HERE
7వ తేదీ వరకు ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకొండి
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS