తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో (బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సుల్లో) ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ ఆగస్ట్ 20న వెలువడనుంది. కరోనా కారణంగా గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేసింది. మొత్తం మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి
తెలంగాణలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సుల్లో చేరాలంటే.. విద్యార్థులందరూ తప్పనిసరిగా DOST లో రిజిస్ట్రేషన్ చేసుకొని.. అప్లై చేసుకోవాలి.
B.A./B.Sc./B.Com./B.Com.(Voc)/B.Com.(Hons)/BSW/BBA/BBM/BCA కోర్సులలో ప్రవేశాల నిమిత్తం దోస్త్ తెలంగాణ 2020 (DOST) ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో ప్రవేశానికి ఇది సింగిల్ విండో సేవలను అందిస్తోంది.
DOST వెబ్‌సైట్ లో https://dost.cgg.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవటం చాలా ఈజీ. ఇది విద్యార్థికి అనువుగా అనుకూలంగా ఉండేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి డిజైన్ చేసింది.
విద్యార్థినీ విద్యార్థులందరూ ఎవరి సహాయం లేకుండా స్వయంగా తమ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను DOST వెబ్ సైట్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.
ముందుగా విద్యార్థులు గూగుల్ సెర్చ్ లేదా ఏ బ్రౌజర్ లోనైనా https://dost.cgg.gov.in అని టైప్ చేయండి. మీకు DOST వెబ్‌సైట్ ఒపెన్ అవుతుంది.
మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఇందులో లాగిన్ కావాలి. అక్కడ మీ పేరు నమోదు చేసుకోవాలి.

విద్యార్తులు అనుసరించాల్సిన స్టెప్స్
విద్యార్థి ఇప్పటికే మొబైల్ నంబర్ ను ఆధార్ నంబర్‌ను లింక్ చేసి ఉంటే, నేరుగా తమ మొబైల్ కి వచ్చిన OTP ద్వారా DOST వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఒకవేళ, విద్యార్థి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్‌తో లింక్ చేయనట్లైతే.. విద్యార్థి/విద్యార్థిని లేదా వారి తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌ను విద్యార్థి ఆధార్‌తో లింక్ చేయాలి.
T App Folio మొబైల్ యాప్ ఆధారిత ఫోటో ప్రామాణీకరణ ద్వారా విద్యార్థులు DOST లో నమోదు చేసుకోవచ్చు
DOSTలో నమోదు కోసం విద్యార్థులు DOST హెల్ప్‌లైన్ సెంటర్ (HLC) లేదా మీ సేవా సెంటర్‌ను సందర్శించవచ్చు.
విద్యార్థులు ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్‌ని సందర్శించినట్లైతే వారికి సరైన గైడెన్స్ లభిస్తుంది.
అప్లై చేసేందుకు ప్రతి విద్యార్థి రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంక్ అకౌంట్ రూపంలో చెల్లించే వీలుంది. దీంతో DOSTలో మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే.. విద్యార్థులకు DOST ID మరియు PIN లభిస్తుంది. అడ్మిషన్ల ప్రాసెస్ మొత్తం ముగిసేంత వరకు విద్యార్థులు తమ DOST ID మరియు PIN ని జాగ్రత్తగా, సీక్రెట్‌గా ఉంచుకోవాలి.
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారం తెరిచేందుకు విద్యార్థులు తమ DOST ID మరియు PIN / password ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
తప్పనిసరిగా దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలన్నీ సరిగ్గా ఫిల్ చేయండి. (ఒక్కసారి మీరు డేటా ఎంటర్ చేస్తే మళ్లీ మార్చలేరు. సవరించటం కుదరదు. అందుకే ముందే జాగ్రత్త పడండి.)
ఇందులోనే విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలను/కోర్సులను మీరు ఎంచుకునే ప్రియారిటీ ఆర్డర్లో (అంటే ఏ కాలేజీలో సీటు రావాలని కోరుకుంటున్నారో… ఫస్ట్.. సెకండ్.. ఇలా..) కోరుకున్న కాలేజీలను ఎంచుకోవాలి. వెబ్ ఆప్షన్లను ఉపయోగించాలి (కాలేజీ మరియు కోర్సు ప్రియారిటీలు ఇచ్చేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఎంచుకున్న అప్షన్లను బట్టి.. మీకు సీట్లు అలాట్ చేస్తారు.)
విద్యార్థులు సెలెక్ట్ చేసుకున్న వివరాలను సీక్రెట్‌గా ఉంచండి. తమ DOST ID/PIN/Passwordను ఎవరితోనూ పంచుకోరాదు.
వెబ్ ఆప్షన్ల ప్రకారం విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.
మెరిట్, రిజర్వేషన్ల ప్రక్రియను అనుసరిస్తారు.
మీకు అలాటైన కాలేజీ, కోర్సు విద్యార్థులకు నచ్చితే ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా మీ సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి. అక్కడ పేర్కొన్న ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 24 వరకు వ్యక్తిగతంగా తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి.. మీ సర్టిఫికెట్లన్నీ ప్రిన్సిపాల్ కు సమర్పించాలి. కాలేజీ ఫీజు అక్కడే చెల్లించి మీ సీటును ఖాయం చేసుకోవాలి..
వెబ్ ఆప్ప్షన్ల ద్వారా మీకు అలాటైన సీటు నచ్చకపోతే ..
నచ్చకపోయినా తమ సీటు రిజర్వేషన్‌కు ఆన్‌లైన్‌లో చూపించిన ఫీజు ముందుగా చెల్లించాలి.చెల్లించిన తరువాత, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు మళ్లీ నమోదు చేసుకోవచ్చు.
సీట్ల రిజర్వేషన్ ప్రక్రియ మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్
రిజర్వేషన్ల కింద సీట్ల కేటాయింపుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మీసేవా కుల ధృవీకరణ పత్రం (సిఎన్‌డి నంబర్ మరియు ఉప కులంతో) నమోదు చేయడం తప్పనిసరి.
01.04.2019 న లేదా తరువాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం (DOST 2020 కి మాత్రమే చెల్లుతుంది), N.C.C. సర్టిఫికేట్, అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్, శారీరకంగా ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, CAP (సాయుధ సిబ్బంది పిల్లలు) సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి.
చెల్లింపు ప్రక్రియ
DOST-2020 లో DOST రిజిస్ట్రేషన్ ఫీజు, సీటు రిజర్వేషన్ ఫీజు మొదలైనవి చెల్లించడానికి ప్రస్తుతం మూడు పేమెంట్ గేట్వేలను వాడుతున్నారు. బిల్-డెస్క్, అటామ్ మరియు టి-వాలెట్ (టీవాలెట్ ద్వారా ఆన్‌లైన్ ఫీజు చెల్లిస్తే ఎలాంటి కమీషన్ కట్ కాదు)
ప్రభుత్వ/ విశ్వవిద్యాలయ/ ప్రైవేట్ కళాశాలలో సీట్ కేటాయింపు పొంది మరియు ePass కాలేజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం రూ.1000/- చెల్లించాలి.
ప్రైవేట్ కాలేజీల్లో సీటు అలాటైన విద్యార్థులు.. ePass ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్నప్పటికీ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు రూ .500 / – చెల్లించాలి.
గవర్నమెంట్, యూనివర్సిటీ కాలేజీల్లో సీటు అలాటై, ePass ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు ఎలాంటి ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.
DOST-2020 లో కొత్త ఫీచర్లు
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు ఈసారి అదనంగా మరిన్ని సేవలను అందిస్తోంది.
TS App Folio టిఎస్ యాప్ ఫోలియోలో రియల్ టైమ్ డిజిటల్ ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది అభ్యర్థుల వ్యక్తిగత మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. (ఈ సేవ TSBIE నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది).
అభ్యర్థి తప్పనిసరిగా DOST ID సేవను కలిగి ఉన్న TS App Folio ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
విద్యార్థి హాల్ టికెట్ (TSBIE), పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
హాల్ టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ మరియు మొబైల్ నెంబర్లు, ఇతర వివరాలు (అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, లింగం, అభ్యర్థి ఫోటోగ్రాఫ్) ధృవీకరణతో తిరిగి TS App Folio దరఖాస్తుకు తిరిగి వెళ్తారు
TSBIEలో లభించే విద్యార్థి చిత్రంతో ప్రత్యక్ష ఛాయాచిత్రం (selfie) సరిపోలితే DOST ID సమాచారం ఇవ్వబడుతుంది.
విద్యార్థులకు SMS మరియు App ద్వారా DOST ID మరియు PIN సమాచారం ఇవ్వబడుతుంది.
విద్యార్థి DOST ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఎంపికలను ఉపయోగించుకునే తదుపరి ప్రక్రియ కోసం వెళ్ళవచ్చు.
ఆన్ లైన్ ఫిర్యాదులకు వాట్సప్
DOST తో అనుసంధానించబడిన వాట్సాప్ చాట్‌బాట్ (ఆటో రెస్పాండర్) సౌకర్యం.
- మీ పరిచయాల జాబితాకు 7901002200ను జోడించండి.
- వాట్సాప్ తెరిచి పై నెంబర్ కు ‘Hi’ అని పంపండి.
- మీరు మా DOST-2020 మెనూను పొందుతారు
- ఇదే ఖాతా OTP లు, హెచ్చరికలు, ప్రచారం మొదలైనవి పంపడానికి ఉపయోగించబడుతుంది.
దోస్త్ సేవ కేంద్రాలు
రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు మొత్తం 60 హెల్ప్ లైన్ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
స్టేట్ లెవల్ హెల్ప్ లైన్ సెంటర్
యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లు – 6
జిల్లా హెల్ప్ లైన్ – 33
కాలేజీ / రీజనల్ హెల్ప్ లైన్ – 20
విద్యార్థులు DOST లో నమోదు చేసుకోవడానికి, ఆధార్ నంబర్లకు సంబంధించిన అసమతుల్యతను సరిదిద్దడానికి, సర్టిఫికేట్లను తప్పుగా అప్‌లోడ్ చేయకుండా సరిచేయడానికి హెల్ప్ లైన్ సెంటర్లు సాయం చేస్తాయి
DOST-2020 ఇతర సామాజిక మాధ్యమాల పేజీలు
*Facebook: https://www.facebook.com/dost.telangana
*Twitter: https://twitter.com/dost_telangana
*DOST YouTube ఛానెల్ లో అన్ని DOST సంబంధిత వీడియోలు మరియు FAQ వీడియోలతో సహాయకారిగా ఉంటాయి