తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల జాబ్స్‌కు ప్రకటన విడుదలైంది. వీటిలో బోధన సిబ్బందిగా పని చేయాలనే ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ , న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ , పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్ మెంట్, జియోగ్రఫీ తదితర కోర్సులు బోధించే అనుభవం గల లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.
దరఖాస్తు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తారు. సెలెక్టయిన లెక్చరర్లు గంటల ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల ఆర్ సి వోలకు తమ దరఖాస్తులు అందించాలి.
Good suggestion
Im completed msc maths i have a good apportunity.