తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 16న నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్లను ఎల్లుండి నుంచి (అక్టోబర్ 9) నుంచి టీఎస్పీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఈ పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం మొత్తం 1040 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ లో 503 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 121 ఎంపీడీఓ ఉద్యోగాలు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, 42 డిప్యూటీ కలెక్టర్, 41 మున్సిపల్ కమిషనర్ , 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2011లో 312 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 11 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ పడుతున్నారు.
TSPSC GROUP 1 HALL TICKETS DOWNLOAD LINK
(NOTE: THIS LINK WILL BE UPDATED ON OCTOBER 9th)
Nice
Inter vallukuda application pettukovacha sir
Nice