HomeLATESTమరో జాబ్ నోటిఫికేషన్.. టెన్త్ అర్హతతో 787 కానిస్టేబుల్ ఉద్యోగాలు

మరో జాబ్ నోటిఫికేషన్.. టెన్త్ అర్హతతో 787 కానిస్టేబుల్ ఉద్యోగాలు

టెన్త్ పాసైన నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) శుభవార్త చెప్పింది. భారీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి (CISF Recruitment 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 787 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లో cisfrectt.in అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 20తో ముగియనుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Advertisement

విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 2022 ఆగస్టు 1కి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
అధికారిక వెబ్ సైట్: cisfrectt.in

అభ్యర్థుల ఎంపిక:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటి మల్టి-లెవల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

దరఖాస్తు ఫీజు:
UR, OBC, EWS కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికుల (ESM) కేటగిరికి చెందిన అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!