HomeLATESTకామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌) నోటిఫికేషన్​ వచ్చేసింది

కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌) నోటిఫికేషన్​ వచ్చేసింది


నేషనల్​ లా యూనివర్సిటీల కన్సార్టియం దేశ‌వ్యాప్తంగా 22 లా యూనివ‌ర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్(క్లాట్‌)-2022కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 31లోపు అప్లై చేసుకోవచ్చు.

Advertisement


1) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)


అర్హత‌:
జనరల్​ అభ్యర్థులు క‌నీసం 45% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణత‌ సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు రావాలి, మార్చి/ ఏప్రిల్ 2022లో ఇంట‌ర్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. గరిష్ట వయోపరిమితి లేదు.


సిలబస్​:

Advertisement


అండర్​ గ్రాడ్యుయేట్స్​ కోసం నిర్వహించే ఎగ్జామ్​ 150 మార్కులకు ఉంటుంది. దీన్ని ఆబ్జెక్టివ్​ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లీష్​ , కరెంట్​ ఎఫైర్స్​, లాజికల్​ రీజనింగ్​, లీగల్​ రీజనింగ్​, క్వాంటిటేటివ్​ టెక్నిక్స్​ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.


ఎగ్జామ్​ ​


సబ్జెక్ట్​ ప్రశ్నలు

Advertisement


ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ 25 నుంచి 32
కరెంట్​ ఎఫైర్స్​, జనరల్​ నాలెడ్జ్​ 35 నుంచి 39
లీగల్​ రీజనింగ్​ 35 నుంచి 39
క్వాంటిటేటివ్​ టెక్నిక్స్​ 13 నుంచి 17
మొత్తం మార్కులు 150
సమయం 2 గంటలు

2) పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఏడాది ఎల్ఎల్ఎం డిగ్రీ)


అర్హత‌: జనరల్​ అభ్యర్థులు క‌నీసం 50% మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ/ త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు రావాలి. ఏప్రిల్‌/ మే 2022లో ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవ‌చ్చు. గరిష్ట వయోపరిమితి లేదు.

Advertisement


సెలెక్షన్​ ప్రాసెస్​
ఈ పరీక్షలో రెండు సెక్షన్స్​ ఉంటాయి. మొదటి సెక్షన్​ ఆబ్జెక్టివ్​ టైప్​లో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్​ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. రెండో సెక్షన్​లో డిస్క్రిప్టివ్​ తరహాలో ఉంటుంది. ఇందులో రెండు ఎస్సేలకు ఆన్సర్​ రాయాలి ప్రతి ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్​ పరీక్షలో అభ్యర్థులకు 40 శాతం ( ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35శాతం) మార్కులు వస్తేనే డిస్క్రిప్టివ్​ పేపర్​ కరెక్షన్​ చేస్తారు.


ఎగ్జామ్​ ప్యాటర్న్​


గరిష్ట మార్కులు 150
సమయం 2 గంటలు
ఆబ్జెక్టివ్​ మార్కులు 100 ( 100 ప్రశ్నలు)
సబ్జెక్టివ్​ మార్కులు 50 ( రెండు ఎస్సేలు)

Advertisement


సిలబస్​


1) కాన్​స్టిట్యూషనల్​ లా
2) అడ్మినిస్ట్రేటివ్​ లా, లా ఆఫ్​ కాంట్రాక్ట్​, టార్ట్స్​, ఫ్యామిలీ లా, క్రిమినల్​ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్​ ఇంటర్నేషనల్​ లా, ట్యాక్స్​ లా, ఇన్విరాన్​మెంటల్​ లా, లేబర్​ అండ్​ ఇండస్ట్రీయల్​ లా.

నోటిఫికేషన్​

Advertisement


ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


అప్లికేషన్​ ఫీజు: ఇత‌రుల‌కు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్ విద్యార్థుల‌కు రూ.3500


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం:
01.01.2022.

Advertisement


చివ‌రి తేది: 31.03.2022.

క్లాట్ ఎగ్జామ్​: 8 మే 2022 (మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు)

వెబ్​సైట్: www.consortiumofnlus.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!