భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం 90 గ్రూప్ బీ నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
పోస్టులు
ఇన్‌స్పెక్టర్ (ఆర్కిటెక్ట్): ఇది ఒక పోస్టు మాత్రమే ఉంది. డిగ్రీ (ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు. వయసు 30 ఏండ్లకు మించకుండా ఉండాలి. జీతం నెలకు రూ.44,900 – నుంచి 1,42,400 వరకు చెల్లిస్తారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): ఈ పోస్టులు మొత్తం 57 ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం నెలకు రూ.35,400 – నుంచి 1,12,400 వరకు చెల్లిస్తారు.