బీహెచ్ఈఎల్ (BHEL) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ విభాగాల్లో మొత్తం 150 ఇంజనీర్/ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో ఈ పోస్టుల ఖాళీలున్నాయి. ఆయా ట్రేడ్లలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీ లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 31, నవంబర్ 1, 2 తేదీల్లో రాత పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూడవచ్చు. https://www.bhel.com/