ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పలు ఉద్యోగాల భర్తీ కి ప్రకటన జారీ చేసింది. మొత్తం 528 పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్స్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్,స్టెనో గ్రాఫర్స్ పోస్టులు వీటిలో ఉన్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, శ్రీ హరికోటలో ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. రిటెన్ టెస్ట్ తో పాటు స్కిల్ టెస్ట్ మెరిట్ ఆధారంగా సెలెక్షన్లు జరుగుతాయి.ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు జనవరి 9 వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లు ఇస్రో వెబ్సైట్లో www.isro.gov.in అందుబాటులో ఉన్నాయి.