తెలంగాణ ఇంటర్ పరీక్షల (IPE MARCH 2023) టై టేబుల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌ను మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.