ఏపీలోని అనంతపురం జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జిల్లాలోని మొత్తం 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్ వాడీ ఉద్యోగాలను (Anganwadi Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Anganwadi Jobs Notification) విడుదల చేసింది. మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ఐడీసీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. వయస్సు 21-35 మధ్య ఉండాలి.
వేతనం: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11500 వేతనం చెల్లించనున్నారు. మినీ అంగన్ వాడీ వర్కర్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేలు చెల్లించనున్నారు. అంగన్ వాడీ హెల్పర్ కు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేలు చెల్లించనున్నారు.
Job