ఫార్మాట్ ఏదైనా, పరిస్థితులు ఎట్లున్నా క్రికెట్ ఆటలోని పూర్తి ఆనందాన్ని అభిమానులకు అందించడంలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఏనాడూ ఫెయిల్ కాలేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించి, జాతీయ జట్టు నుంచి రిటైరైనా ఐపీఎల్ ద్వారా తన తడాఖా చూపుతున్నాడు. ధోనీని సూపర్ హీరోగా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, లక్నో జట్టుతో ఆడిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి మూడో బంతికి అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతడికి యూనిఫామ్ కు సూపర్ మ్యాన్ మాదిరిగా రెక్కులను ఏర్పాటు చేయాలంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సూచించారు. అభిమానులకు కూడా ఇదే పిలుపునిచ్చారు. వాటిలో మంచి డిజైన్ ను ధోనీ యూనిఫామ్ కోసం సీఎస్కే తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెటిజన్లు పలువురు తమదైన సూపర్ హీరో క్యాస్ట్యూమ్ డిజైన్లను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు.