నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
బ్యాచిలర్ కోర్సులు (బి.డిజైన్): యాక్ససరీస్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్
అర్హత: ఇంటర్ పాస్ అవ్వాలి.
వయసు: 1 ఆగస్టు 2022 నాటికి 24 ఏండ్లకు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష – (క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ)లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని సిచువేషన్ టెస్ట్‌కి సెలెక్ట్ చేస్తారు.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్): అపెరల్ ప్రొడక్షన్
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: 1 ఆగస్టు 2022 నాటికి 24 ఏండ్లకు మించరాదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ) ఆధారంగా ఎంపిక.
మాస్టర్స్ ప్రోగ్రామ్స్: మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసుతో సంబంధం లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
డాక్టోరల్ కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరి తేది: యూజీ/ పీజీ కోర్సులకు జనవరి మొదటి వారం.
వెబ్సైట్: www.nift.ac.in