తెలంగాణా రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్ లో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(కేటగిరీ-7) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దీనిని విడుదల చేసింది. డిగ్రీ, ఎల్ఎల్బీ లేదా బీఎల్ పూర్తి చేసి కనీసం మూడేళ్ళ పాటు న్యాయవాద వృత్తిలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మా లో ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మండలి సూచించింది.పూర్తి వివరాలు వెబ్ సైట్ లో త్వరలో లభ్యం అవుతాయి.
Advertisement